Best 5G Smart Phone Under @ Rs15,000: అతి తక్కువ ధరకే Samsung Galaxy F14 స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు అదుర్స్! ఏకంగా 6000 బ్యాటరీ!
Samsung Galaxy F14 5G @ Rs 15,000: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ఫోన్ ధర 15 వేల రూపాయల లోపే ఉంటుంది. బడ్జెట్ తక్కువగా ఉన్నవారికి ఈ ఫోన్ మంచి ఎంపిక.
Best 5G Smart Phones Under @ Rs 15,000: సౌత్ కొరియాకు చెందిన 'శాంసంగ్' మొబైల్ కంపెనీకి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే వారం భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఆ స్మార్ట్‌ఫోన్ మరేదో కాదు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ (Samsung Galaxy F14 5G). తక్కువ ధరకే 5జీ ఫోన్లను విడుదల చేయడం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను 5జీ వైపు ఆకర్షించాలని శాంసంగ్ చూస్తోంది. ఈ ఫోన్ ధర 15 వేల రూపాయల లోపే ఉంటుంది. బడ్జెట్ తక్కువగా ఉన్నవారికి ఈ ఫోన్ మంచి ఎంపిక.
Samsung Galaxy F14 5G Specifications:
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది కాకుండా శక్తివంతమైన 5nm Exynos చిప్‌సెట్ ఉంటుంది. ఇది మంచి గేమ్-ఛేంజర్‌గా ఉపయోగపడుతుంది. శాంసంగ్ యొక్క కొత్త 5nm చిప్‌సెట్ (Exynos 1330) మల్టీ-టాస్కర్ల కోసం రూపొందించబడిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. అంతేకాదు వేగవంతమైన మరియు ఎక్కువ బ్యాటరీ రన్ అందిస్తుంది.
Samsung Galaxy F Series:
ఆక్టా-కోర్ సీపీయూలో పనితీరు-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం ARM కార్టెక్స్-A78 డ్యూయల్ కోర్ మరియు పవర్ ఎఫిషియన్సీతో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే టాస్క్‌ల కోసం కార్టెక్స్-A55 హెక్సా-కోర్ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం భారతదేశంలో శాంసంగ్ యొక్క రెండవ F సిరీస్ స్మార్ట్‌ఫోన్. కంపెనీ ఇంతకుముందు జనవరిలో గెలాక్సీ ఎఫ్4 (Samsung Galaxy F4)ను విడుదల చేసింది.
Samsung Galaxy F14 5G Launch:
మార్చి నెలాఖరులో దేశవ్యాప్తంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ మరియు ప్రధాన రిటైల్ స్టోర్లలో ఏ ఫోన్ విక్రయించబనుంది. దేశంలో 5G సేవలను బలోపేతం చేయడానికి శాంసంగ్ ఈ సంవత్సరం భారతదేశంలో అనేక 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ వారం దేశంలో Samsung Galaxy A34 5G మరియు Samsung Galaxy A54 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తుంది.
Also Read: Virat Kohli Records: ప్రపంచ రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. క్రికెట్ చరిత్రలోనే 'ఒకే ఒక్కడు'!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి