Best Camera Phone Under 15000: రూ.9,999లకే 108 మెగాపిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ ఇవే.. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే కొనుగోలు చేయండి!
Best Camera Phone Under 15000: తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఇటు ఓ లుక్ వేయాల్సిందే. మేము ఈరోజు మీ ముందుకి తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను పరిచయం చేయబోతున్నాం. అయితే ఆ స్మార్ట్ ఫోన్ లేంటో? వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Best Camera Phone Under 15000: ప్రస్తుతం చాలామంది యువత ఫోటోగ్రఫీ కోసం అత్యధిక మెగాపిక్సెల్ ఉన్న స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వీటితోపాటు కెమెరా ఫీచర్స్, స్టెబిలిటీ ని కూడా చెక్ చేసి స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది యువత ప్రీమియం కంపెనీలకు చెందిన వన్ ప్లస్, రియల్ మీ, ఐక్యు స్మార్ట్ ఫోన్ లను కొంటున్నారు. అయితే ఈ ప్రీమియం ఫోన్లు రూ.20,000 పైగా ఉండడంతో సాధారణ వినియోగదారులు కొనుగోలు చేయలేకపోతున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని కొన్ని కంపెనీలు సాధారణ బడ్జెట్లో ఎక్కువ మెగాపిక్సెల్ ఉన్న స్మార్ట్ ఫోన్ లను ఇటీవలే లాంచ్ చేశాయి. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ ఏమిటని అనుకుంటున్నారా? ఆ మొబైల్ ఫోన్స్ ఏంటో రండి చూద్దాం..
రియల్ మీ ఇటీవల విడుదల చేసిన c53 స్మార్ట్ ఫోన్ కు మార్కెట్లో మంచి గుర్తింపు లభించింది. స్మార్ట్ ఫోన్ తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ కామర్స్ కంపెనీలో ఈ మొబైల్ ఫోన్ రూ. 9,999 లభిస్తోంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఈ Realme C53 ఫోన్ 108-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాను కలిగి ఉండడమే కాకుండా 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో మార్కెట్లో లభిస్తోంది.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
తక్కువ బడ్జెట్లో కస్టమర్లకు మంచి ఫీచర్లను అందించే స్మార్ట్ఫోన్ కంపెనీలో రెడ్మి బ్రాండ్ కూడా ఒకటి. అయితే ఈ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన Redmi Note 11S మొబైల్ ఫోన్ కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లు మీరు అమెజాన్ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేస్తే రూ.12,999 లతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే..108 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో కేవలం ఒక వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది.
తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ ఇప్పుడే కొనుగోలు చేయాలనుకుంటే Infinix Note 30 5G స్మార్ట్ ఫోన్ పై ఈ కామర్స్ వెబ్సైట్లో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు నడుస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో రూ. 14,999 ధరతో లభిస్తోంది. ఇందులో చాలా రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే సపోర్టుతో లభిస్తోంది. ఇక బ్యాటరీ చార్జర్ విషయానికొస్తే..45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి