COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Best boAt Immortal 201 Hearbuds In Low Cost: ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఇయర్‌బడ్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. మీరు కూడా ఇలాంటి ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ టెక్‌ కంపెనీ boAt ఇటీవలే Immortal 201 మోడల్‌లో ఇయర్‌ బడ్స్‌ను విడుదల చేసింది. ఈ బడ్స్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చాయి. కంపెనీ వీటిని  గేమర్‌లను దృష్టిలో పెట్టుకుని లాంచ్‌ చేసిన్నట్లు తెలిపింది. అంతేకాకుండా కంపెనీ ఈ బడ్స్‌ కొత్తగా కేస్‌పై  LED లైట్ల సెటప్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ ఇయర్‌బడ్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌, ఇతర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఇయర్‌బడ్స్‌ ఇతర వివరాలు:
ఈ boAt Immortal 201 స్టెమ్, సిలికాన్ ఇయర్ టిప్స్‌తో పాటు వినియోగదారులను ఆకర్శించేందుకు ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు కంపెనీ కొత్తగా ఎల్‌ఈడీ(LED) లైట్స్‌ను అందిస్తోంది. బోట్‌ మొట్టమొదటి సారిగా రౌండ్‌ సర్కిల్ కలిగిన RGB LED లైట్లుతో ఈ బడ్స్‌ను తీసుకవస్తోంది. ఇవి టచ్ కంట్రోల్‌లతో పాటు చెమట, స్ప్లాష్ రెసిస్టెంట్, IPX4 రేటింగ్‌ను కూడా కలిగి ఉంటాయి. కంపెనీ ప్రీమియం ఆడియో కోసం..ఈ ఇయర్‌బడ్స్‌లో 10mm డ్రైవర్‌లతో రాబోతోంది. దీంతో పాటు బోట్ సిగ్నేచర్ సౌండ్‌ సెటప్‌తో రాబోతోంది. 


అంతేకాకుండా ఈ boAt Immortal 201 ఇయర్‌బడ్స్‌లో కాలింగ్ సమయంలో స్పష్టమైన సౌండ్ క్వాలిటీ పొందడానికి ENX టెక్నాలజీతో కూడిన నాలుగు మైక్‌లను కూడా అందిస్తోంది. ఇవి 40ఎంఎస్ సూపర్‌ లేటెన్సీ మోడ్‌ను కూడా కలిగి ఉంటాయి. ఈ ఫీచర్‌తో గేమింగ్ సమయంలో మంచి ప్రీమియం సౌండ్ అనుభూతిని పొందుతారు. 


40 గంటల బ్యాటరీ లైఫ్‌:
ఈ boAt Immortal 201 ఇయర్‌ బడ్స్‌ను పూర్తిగా ఛార్జ్‌ చేస్తే దాదాపు 40 గంటల పాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. దీంతో పాటు ఇది బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో అందుబాటులోకి వచ్చింది. ఇది స్మార్ట్‌ ఫోన్‌కి 10 మీటర్ల దూరంలో కూడా పని చేస్తుంది. అలాగే కంపెనీ ఇందులో 'ఇన్‌స్టా వేక్ ఎన్ పెయిర్' టెక్నాలజీని కూడా అందిస్తోంది. దీని ద్వారా బడ్స్‌కి సంబంధించిన కేస్‌ ఓపెన్‌ అవ్వగానే కనెక్ట్‌ అవుతుంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఇయర్‌బడ్స్ 380mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ప్రతి ఇయర్‌బడ్‌లో 40mAh బ్యాటరీ ఉంటుంది. వీటిని ఒక్కసారి పూర్తి ఛార్జ్‌ చేస్తే దాదాపు 40 గంటల పాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. భారత్‌లో బోట్ ఇమ్మోర్టల్ 201 ఇయర్‌ బడ్స్ ధర రూ.1,299తో అందుబాటులో ఉంది. ఈ బడ్స్‌  మొత్తం రెండు (బ్లాక్ సాబెర్, వైట్ సాబర్) వేరియంట్స్‌లో లాంచ్‌ అయ్యాయి. ప్రస్తుతం ఇది బోట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులో ఉంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter