Big Billion Day Sale: ఫ్లిప్కార్ట్ ప్లస్ అకౌంట్ దారులకు బిగ్ బిలియన్ సేల్ మొదలయ్యింది.. ప్లస్ వినియోగదారులకు ముందుగానే ఈ సేల్ మొదలవడం విశేషం. సెల్లో భాగంగా అన్ని రకాల వస్తువులు తక్కువ ధరలకే విక్రయిస్తోంది ఫ్లిప్కార్ట్. ఇక అమెజాన్ విషయానికొస్తే బిగ్ ఇండియా ఫెస్టివల్ కూడా అందులో మొదలైంది. ఎలక్ట్రానిక్ వస్తువుల పై ఇప్పటికే ఫ్లిప్కార్ట్, అమెజాన్ భారీ డిస్కౌంట్ తో వినియోదారులకు విక్రయిస్తోంది. ముఖ్యంగా ఫోన్ల విషయానికొస్తే ప్రముఖ బ్రాండింగ్ మొబైల్స్ అయినా శాంసంగ్, ఒప్పో, రెడ్మి, వన్ ప్లస్, నథింగ్, యాపిల్ అలాంటి వాటిపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్కార్ట్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే నథింగ్ ఫోన్( Nothing Phone 1) విషయానికి వస్తే.. ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ సేల్ సందర్భంగా చాలా చౌకగా లభిస్తోంది. నథింగ్ 1 మోడల్ మొదటగా రూ. 37,999కి మార్కెట్లోకి విడుదల చేయగా.. ప్రస్తుతం దీని ధర డిస్కౌంట్ పోను రూ.31,199కే లభిస్తోంది. ఇక ఈ ఫోను ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే.. దాదాపు రూ. 1400 నుంచి రూ. 1700 దాకా డిస్కౌంట్ పొందవచ్చు. కాబట్టి నథింగ్ ఫోన్ కొనాలనుకున్నవారు ఈ సెల్ లో భాగంగా కొనుగోలు చేస్తే చౌకగా పొందవచ్చు. అయితే ఈ ఫోన్ పై నో కాస్ట్ ఇఎంఐ కూడా అందుబాటులో ఉంది. ఎవరైనా ఇఎంఐతో కొనుగోలు చేయాలనుకుంటే ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. అయితే దీనిపై ప్రత్యేకమైన ఎక్చేంజ్‌  ఆఫర్‌ కూడా నడుస్తోంది. మీ పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేసి రూ. 16,900 దాకా తగ్గింపు పొందవచ్చు.  ఇక అన్ని ఆఫర్లు పోను భారీ డిస్కౌంట్‌తో రూ. 16,895 కే ఈ ఫోన్‌ లభించనుంది.


ప్రత్యేకమైన ఫీచర్లు ఇవే:
>>6.55 ఇంచుల Full HD+ OLED డిస్‌ప్లేను
>>120Hz రిఫ్రెష్ రేట్
>>కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
>>క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌
>>ఆండ్రాయిడ్‌ 12
>> 50 మెగాపిక్సెల్ కెమెరా
>>50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా
>>16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
>>4,500mAh బ్యాటరీ
>>33 వాట్ల వైర్డ్, 15 వాట్ల వైర్‌లెస్‌
>>5 వాట్ల రివర్స్ వైర్‌లెస్‌ చార్జింగ్‌
>>ఎల్ఈడీ లైట్స్ బ్యాక్ ప్యానెల్


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook