Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికల సందర్భంగా రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. రాజకీయ నాయకులు మీరంటే మీరని.. కాదు మీరంటే మీరని.. విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. రాహుల్ గాంధీ అధికార పార్టీ బిఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. బిఆర్ఎస్ నాయకులు కూడా ప్రతి విమర్శలు చేస్తూ.. ముందుకు సాగుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ పార్టీ నాయకుడు జీవం రెడ్డి ''క్వీన్ ఎలిజబెత్ రాణి'' అంటూ ఎమ్మెల్సీ కవిత సంబోదించటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. కవిత మీడియాతో మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలి. నన్ను క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలవటం కాదు.. నేను మీ ఇటలీ రాణిని కాదు. మీ ఇటలీ రాని లెక్క నేను వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను నేను బలి తీసుకోలేదు. మీరు దిగజారిపోయి.. హోదాను మరిచిపోయి తెలంగాణకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానించినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతున్నాను.


బతుకమ్మ మీద గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టుకుని పండగ చేసుకుంటామని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన వయస్సు ఏంది.. ? ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంది..? ఆయన స్థాయి , గౌరవం ఏంది..? ఒక్క ఎన్నిక గెలవడానికి ఇంత దిగజారి మాట్లాడతారా.. ? ఇంత అవమానం చేస్తారా.. ? ఉద్యమ సమయంలో నిర్బంధం ఉన్న కాలంలో ఆడబిడ్డలు సగర్వంగా ఆత్మ గౌరవానికి ప్రతీక అని నెత్తిమీద పెట్టుకుని మోసినటువంటి బతుకమ్మను అవమానించిన జీవన్ రెడ్డిని పక్కన పెట్టుకొని రాహుల్ గాంధీ జగిత్యాలలో ముచ్చట్లు చెప్పారు."


ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 2009లో దీక్ష చేస్తే ఇచ్చినటువంటి తెలంగాణను వెనక్కి తీసుకొని వందలాది బిడ్డల ప్రాణాలను తీసుకున్న ఇటలీ రాణి సోనియాగాంధీ అసలైన బలిదేవత.. 
సీఎం కేసీఆర్ చావు నోట్లో తల పెడితే 2009లో తెలంగాణ ఏర్పాటును ప్రకటించి మళ్లీ వెనక్కి తీసుకుంటే వందలాదిమంది బిడ్డల చావులకు సోనియాగాంధీ కారణమయ్యారు.. 


Also Read: AP CM YS Jagan: ఒప్పంద ఉద్యోగులకు దసరా కానుక, రెగ్యులరైజ్ చేస్తూ ఆదేశాలు


రాహుల్ గాంధీ కాదు.. ఎలక్షన్ గాంధీ. ఎన్నికల రాగానే అనుబంధం.. కుటుంబం..  మన్నుమశానం అని చెబుతున్నారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రలో కలిపినప్పుడు, హైకోర్టు కావాలని మేము పార్లమెంట్లో పోరాటం చేసినాడు.. విభజన హామీల్లో ఒక్క హామీని కూడా బిజెపి ప్రభుత్వం నెరవేర్చనపుడు.. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించనపుడు.. రాహుల్ గాంధీ ఎక్కడున్నారు..? అపుడు ఎందుకు మాట్లాడలేదు..?


పార్లమెంటులో తెలంగాణను నరేంద్ర మోడీ అవమానం చేసినప్పుడు రాహుల్ గాంధీ సోనియాగాంధీ సభలోనే ఉన్నా కూడా అభ్యంతరం చెప్పలేదని కవిత గుర్తు చేశారు. ఇటువంటి రాహుల్ గాంధీ మనకు కావాలా లేదా కేసీఆర్ కావాలా..? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. 


మంథనిలో దొర అయిన శ్రీధర్ బాబును పక్కన పెట్టుకొని రాహుల్ గాంధీ అలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. డిసిసి అధ్యక్షుడు దళిత బిడ్డ కవ్వంపల్లి సత్యనారాయణకు మాట్లాడే అవకాశం ఉండదు కానీ శ్రీధర్ బాబు మాత్రం మాట్లాడారని.. రాహుల్ ప్రసంగాన్ని తర్జుమా చేయడానికి దళిత బిడ్డ అడ్డలూరి లక్ష్మణ్ ను కాకుండా జీవన్ రెడ్డికి ఎలా అవకాశం ఇచ్చారు..? అని ఎమ్మెల్సీ కవిత  పేర్కొన్నారు. 


Also Read: Bhagavanth Kesari : హాఫ్ సెంచరీ కొట్టేసిన బాలకృష్ణ.. దసరా విన్నర్ షురు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..