Motorola 5G Smartphone: కేవలం రూ. 699లకే మోటరోలా 5G స్మార్ట్‌ఫోన్.. బ్యాంక్ ఆఫర్ అనుకుంటే పొరబడినట్టే!
Buy Motorola G62 5G Smartphone Just Rs 699, Check Details. మోటరోలా జీ62 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 21,999. ఈ ఫోన్‌ను కేవలం రూ. 699కి కొనుగోలు చేయవచ్చు.
Motorola G62 5G Smartphone Bring Home just Rs 699: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023 ముగిసింది. ప్రస్తుతం 'మోటో డేస్' సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ చివరి రోజు నేడు. ఈ సేల్ సందర్భంగా మోటరోలా తన స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను ఇస్తోంది. 5G స్మార్ట్‌ఫోన్‌లపై కూడా గొప్ప తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. మోటో డేస్ సేల్ (Moto Days Sale 2023)లో మోటరోలా అత్యంత ప్రజాధారణ పొందిన 5G ఫోన్‌ను కేవలం రూ. 699కి కొనుగోలు చేయవచ్చు. అయితే బ్యాంక్ ఆఫర్‌లో మాత్రం కాదు. ట్రేడ్ ఇన్ సహాయంతో ఆ ఫోన్‌ను చౌకగా కొనుగోలు చేయవచ్చు.
Motorola G62 5G Offers & Discounts:
మోటరోలా జీ62 5G ( Motorola G62 5G 128 GB) స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 21,999. అయితే మోటో డేస్ సేల్‌లో భాగంగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ. 14,999కి అందుబాటులో ఉంది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌పై 31 శాతం తగ్గింపు ఇస్తోంది. ఫోన్‌పై గొప్ప ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఇది ఫోన్ ధరను మరింత తగ్గిస్తుంది.
Motorola G62 5G Exchange Offer:
మోటరోలా జీ62 5Gపై రూ. 14,300 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. మీకు ఇంత మొత్తం లభిస్తుంది. అయితే మీ పాత ఫోన్ కండిషన్ బాగుండి, లేటెస్ట్ మోడల్ అయినప్పుడు మాత్రమే రూ. 14,300 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. మీరు పూర్తిగా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పొందితే.. ఫోన్ రూ. 699కి మీ సొంతం అవుతుంది.
Motorola G62 5G Bank Offer:
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ చేయకూడదనుకుంటే.. బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు మోటరోలా జీ62 5G ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. రూ. 750 తగ్గింపు లభిస్తుంది. అంటే 10 శాతం ఆఫర్ ఇస్తున్నారు. దాంతో ఈ ఫోన్ ధర రూ. 14,249గా ఉంటుంది.
Also Read: Saturn Moon Conjunction 2023: అరుదైన విష యోగం.. ఈ రాశుల వారి పని ఔట్! రాబోయే 3 రోజులు జాగ్రత్త
Also Read: Car Booking Cancellation: ఈ కార్ బుకింగ్‌ను రద్దు చేసుకుంటే.. భారీ మొత్తంలో డబ్బు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.