Drop Realme C51 Price: కొత్త Realme C51 మొబైల్ ఇప్పుడు కేవలం రూ.6,999కే..ఇంత తక్కువ ధరకు మళ్లీ రాదు..
Buy Realme C51 At Half Price: ప్రముఖ టెక్ కంపెనీ రియల్ మీ ఇటీవలే విడుదల చేసిన Realme C51 మొబైల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో డెడ్ చీప్‌గా కొనుగోలు చేయోచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ప్రత్యేక కూపన్ కూడా లభిస్తోంది..
Drop Realme C51 Price: స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని చాలా వరకు టెక్ కంపెనీ మిడిల్ రేంజ్ మొబైల్స్‌ను మాత్రమే మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా రియల్ మీ, రెడ్ మీ వంటి బ్రాండ్‌లు ఎక్కువగా ఫ్రీమియం ఫీచర్స్‌తో పాటు మిడిల్ రేంజ్ స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఇటీవలే Realme విడుదల చేసిన Realme C51 స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని రియల్‌మీ వెబ్‌సైట్ ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Realme C51 మొబైల్ ధర:
realme C51 స్మార్ట్ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. ఈ మొబైల్ MRP ధర రూ.10,999తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అయితే సంక్రాంతి ప్రత్యేక డీల్‌లో భాగంగా ఈ మొబైల్ కేవలం రూ.7,999కే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్ పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేస్తే రూ.1,000 వరకు కూపన్ తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.6,999కే పొందవచ్చు.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
Realme C51 మొబైల్ స్పెసిఫికేషన్స్:
ఈ స్మార్ట్ ఫోన్ స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే..Realme C51 మొబైల్ 6.74 అంగుళాల ఫుల్ HD IPS LCD డిస్‌ప్లేతో పాటు శక్తివంతమైన రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది. దీంతో పాటు అతి తక్కువ బడ్జెట్‌లో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇక కెమెరా విషయానికొస్తే..50MP ప్రధాన ప్రైమరీ కెమెరాతో పాటు మరో 0.08MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ 5MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో లభిస్తోంది. దీంతో పాటు 33W SUPERVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ 7.99 mm స్లిమ్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ Octa Core ప్రాసెసర్‌తో లభిస్తోంది.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter