Apple Security Alert: ఆపిల్ యూజర్లకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ఆపిల్ ఉత్పత్తుల్లో రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్‌కు సంబంధించి భద్రతా లోపముందని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ  తెలిపింది. దీనివల్ల ఆపిల్ ఫోన్లను హ్యాకర్లు తమ ఆధీనంలో తీసుకునే అవకాశముందని స్పష్టం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, మ్యాక్‌బుక్, ఐ ప్యాడ్, విజన్ ప్రో హెడ్‌సెట్ వినియోగించేవాళ్లు హై రిస్క్‌లో ఉన్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. సైబర్ దాడులకు హ్యాకర్లు ఉపయోగించే ఆర్బిటరీ కోడ్ ఆపిల్ ఉత్పత్తుల్లో ఉందని భారత దేశపు సైబర్ సెక్యూరిటీ సంస్థ సెర్ట్ తెలిపింది. ఈ కోడ్ నేరుగా ఆపిల్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌పై దాడి చేసి సదరు పరికరాలను తమ ఆధీనంలో తీసుకుంటాయని వెల్లడించింది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు తక్షణం తమ డివైస్‌లను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సెర్ట్ సూచించింది.


ఎవరు అప్‌డేట్ చేసుకోవాలి


ఆపిల్ ఐవోఎస్, ఐప్యాడ్ ఓఎస్‌లో 17.4.1, 16.7.7 కు ముందున్న వెర్షన్లు వినియోగించేవారు, ఆపిల్ సఫారీలో 17.4.1, ఆపిల్ మ్యాక్ వెంచురాలో 13.6.6, ఆపిల్ ఓఎస్ సొనోమా 14.4.1, ఆపిల్ విజన్ ఓఎస్ 1.1.1కు ముందున్న వెర్షన్లు వినియోగించేవారిపై  ఈ ఆర్బిటరీ కోడ్ ప్రభావితం చేయగలదని సెర్ట్ తెలిపింది. అందుకే ఆపిల్ ఉత్పత్తుల యూజర్లు తమ డివైస్‌లు హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే తక్షణం లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ కావల్సి ఉంటుంది. అదే విధంగా ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఐప్యాడ్ ప్రో 12.9 ఇంచెస్, ఐప్యాడ్ ప్రో 10.5 ఇంచెస్, ఐప్యాడ్ ప్రో 11 ఇంచెస్ , ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ యూజర్లు 17.4కు ముందున్న ఐఓఎస్ , ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్ వినియోగిస్తుంటే హ్యాకర్ల దాడికి గురయ్యే అవకాశాలున్నాయి. 


అందుకే తక్షణం తమ డివైస్‌లను 16.7.7 లేదా 17.4.1 వెర్షన్లకు అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవల్సిన పరిస్థితి వస్తే థర్డ్ పార్టీ నుంచి కాకుండా ఆపిల్ అధికారిక యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. పబ్లిక్ వైఫై నెట్‌వెర్క్‌లు ఉపయోగించకూడదు. 


Also read: Whatsapp Insta Services: అర్ఱరాత్రి నిలిచిపోయిన వాట్సప్, ఇన్‌స్టా సేవలు, నెటిజన్ల ఆందోళన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook