Jio Rs 179 & 149 Recharge Plan with unlimited calling & Data: మీరు 'జియో' ప్రీపెయిడ్ కస్టమర్ అయి ఉండి, ప్రతి నెలా ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌ని యాక్టివేట్ చేసుకుంటే.. అందులో మీకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఆ ప్లాన్‌లో మీరు ఆ ప్రయోజనాలను ఉపయోగించుకోలేకపోతే మీ డబ్బు వృధా అవుతుంది. ఇప్పుడు మీకు అలాంటి సమస్యే ఉండదు. జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల జాబితాలో డబ్బు వృథా కానీ కొన్ని రీఛార్జ్ ప్లాన్‌లు (Cheapest Jio Recharge Plan 2023) ఇటీవల చేర్చబడ్డాయి. ఇందులో కూడా మీరు ఖరీదైన ప్లాన్‌ల ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ కోసం మీరు రూ. 200 కంటే తక్కువ చెల్లించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio 149 Recharge Plan:
పైన చెప్పిన చౌకైన జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ మరేదో కాదు రూ. 149 రీఛార్జ్ ప్లాన్. జియో తన ప్రీపెయిడ్ రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోలో రూ. 149 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కస్టమర్లకు అందిస్తుంది. ఇందులో మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్‌లో మీరు అపరిమిత కాలింగ్‌ను పొందడమే కాకూండా.. ఇంటర్నెట్ ప్రయోజనాలను కూడా పొందుతారు. ఆ వివరాలు ఓసారి చూద్దాం. 


రూ. 149 రీఛార్జ్ ప్లాన్ యొక్క వాలిడిటీ 20 రోజులు. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు ప్రతిరోజూ 1 GB డేటా ఇవ్వబడుతుంది. ఇది మాత్రమే కాదు 20 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 100 SMSలను పొందుతారు. ఈ ప్లాన్ పొదుపుగా ఉండడమే కాకుండా.. మంచి  ప్రయోజనాలతో కూడుకున్నది. మనీ తక్కువగా ఉండి.. అత్యవసరం అయిన వారికి ఈ ప్లాన్ చాలా బాగుంటుంది. 


Jio 179 Recharge Plan: 
రూ. 179 రీఛార్జ్ ప్లాన్‌లో కంపెనీ కాలింగ్ వంటి ప్రయోజనాలతో సహా మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 24 రోజులు. వినియోగదారులకు ప్రతిరోజూ 1 GB డేటా ఉపయోగించుకోవచ్చు. వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు డైలీ 100 SMSలను పొందుతారు.


Also Read: Guru Chandal Yog 2023: బృహస్పతి-రాహు కలయిక.. ఈ 3 రాశుల వారి జీవితంలో గందరగోళం! డబ్బు నష్టపోయే అవకాశం  


Also Read: KKR vs RCB Live Updates: కోల్‌కతా vs బెంగళూరు బిగ్ ఫైట్.. లైవ్ అప్‌డేట్స్ మీ కోసం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి