KKR vs RCB IPL 2023 9th Match Live Updates: చెలరేగిన కోల్‌కతా స్పిన్నర్లు.. బెంగళూరుకు ఘోర పరాభవం!

IPL 2023 Kolkata Knight Riders vs Royal Challengers Bangalore Updates. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల (KKR vs RCB Updates) మధ్య జరుగుతోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Apr 6, 2023, 11:11 PM IST
  • KKR vs RCB IPL 2023 Updates: IPL 2023 Kolkata vs Bangalore Pitch, weather Report, Playing XI, live streaming and squad. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల (KKR vs RCB Live Updates) మధ్య జరుగుతోంది.
     
KKR vs RCB IPL 2023 9th Match Live Updates: చెలరేగిన కోల్‌కతా స్పిన్నర్లు.. బెంగళూరుకు ఘోర పరాభవం!
Live Blog

IPL 2023 Kolkata Knight Riders vs Royal Challengers Bangalore Live Score Updates: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2023లో భాగంగా నేడు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల (KKR vs RCB Live Updates) మధ్య జరుగుతోంది. మెగా టోర్నీలో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా.. ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించింది. దాంతో కోల్‌కతా జట్టు సొంతమైదానంలో అయినా బోణి కొట్టి పాయింట్ల పట్టికలో దూసుకెళ్లాలని చూస్తోంది. మరోవైపు విజయంతో టోర్నీని ఆరంబించిన బెంగళూరు మరో గెలుపుపై కన్నేసింది. దాంతో ఈ మ్యాచ్ (Kolkata Knight Riders Vs Royal Challengers Bangalore live coverage) రసవత్తరంగా సాగనుంది.  

6 April, 2023

  • 23:09 PM

    ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2023లో భాగంగా గురువారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఘన విజయం సాధించింది. కోల్‌కతా నిర్ధేశించిన 205 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌట్ అయి.. రన్స్ తేడాతో ఓడిపోయింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (21), ఫాఫ్ డుప్లెసిస్ (23) టాప్ స్కోరర్లు. కేకేఆర్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, సుయాష్‌ శర్మ చెలరేగారు. అంతకుముందు కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 రన్స్ చేసింది. శార్దూల్‌ ఠాకూర్ (68), రహ్మనుతుల్లా గుర్బాజ్ (57) హాఫ్ సెంచరీలు చేశారు.
     

  • 23:07 PM

    17 ఓవర్లు: సుయాష్‌ శర్మ వేసిన ఈ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు రావడంతో బెంగళూరు స్కోరు 121/9కి చేరింది. ఆకాశ్‌ దీప్, డేవిడ్ విల్లే ఆడుతున్నారు. 
     

  • 22:47 PM

    దినేశ్ కార్తిక్‌ (9)ను ఇంపాక్ట్‌ ప్లేయర్ సుయాష్‌ ఔట్ చేశాడు. డీకే భారీ షాట్‌ ఆడి వరుణ్‌ చక్రవర్తి చేతికి చిక్కాడు. దీంతో 86 పరుగుల వద్ద బెంగళూరు 8వ వికెట్‌ను కోల్పోయి 13 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ స్కోరు 86-8. క్రీజ్‌లో డేవిడ్ విల్లే, కర్ణ్‌ శర్మ ఉన్నారు.
     

  • 22:38 PM

    బెంగళూరు ఆరో వికెట్‌ను కోల్పోయింది. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో (11.3 ఓవర్) బ్రాస్‌వెల్‌ భారీ షాట్ కొట్టగా.. నితీశ్ రాణా అద్భుతంగా క్యాచ్ పట్టాడు.
     

  • 22:31 PM

    11 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు ఐదు వికెట్ల నష్టానికి 78 రన్స్ చేసింది. దినేశ్ కార్తిక్‌ (4), మైఖేల్ బ్రేస్‌వెల్ (19) క్రీజులో ఉన్నారు.
     

  • 22:28 PM

    10 ఓవర్లు: బెంగళూరు స్కోర్ 69/5. దినేశ్ కార్తిక్‌ (2), మైఖేల్ బ్రేస్‌వెల్ (12) క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ ఇంకా 60 బంతుల్లో 136 రన్స్ చేయాలి. 
     

  • 22:22 PM

    బెంగళూరు ఐదు వికెట్స్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ (21), ఫాఫ్ డుప్లెసిస్ (23), గ్లెన్ మాక్స్‌వెల్ (5), హర్షల్ పటేల్ (0), షాబాజ్ అహ్మద్ (1) వరుసగా పెవిలియన్ చేరారు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ స్పిన్ దెబ్బ కొట్టారు. 
     

  • 22:17 PM

    బెంగళూరు నాలుగో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ (5) డకౌట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో  హర్షల్ ఔట్ అయ్యాడు. 
     

  • 22:15 PM

    బెంగళూరుకి మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ (5) బోల్డ్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి స్పిన్ దెబ్బకు మ్యాక్సీ పెవిలియన్ చేరాడు. 
     

  • 22:06 PM

    వరుణ్ చక్రవర్తి వేసిన 6వ ఓవర్ రెండో బంతికి ఫాఫ్ డుప్లెసిస్ (23) ఔట్ అయ్యాడు. దీంతో బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. 6 ఓవర్లకు బెంగళూరు స్కోరు 50-2. మైఖేల్ బ్రేస్‌వెల్ (2), గ్లెన్ మాక్స్‌వెల్ (4) క్రీజులో ఉన్నారు. 
     

  • 22:06 PM

    వరుణ్ చక్రవర్తి వేసిన 6వ ఓవర్ రెండో బంతికి ఫాఫ్ డుప్లెసిస్ (23) ఔట్ అయ్యాడు. దీంతో బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. 6 ఓవర్లకు బెంగళూరు స్కోరు 50-2. మైఖేల్ బ్రేస్‌వెల్ (2), గ్లెన్ మాక్స్‌వెల్ (4) క్రీజులో ఉన్నారు. 
     

  • 22:02 PM

    బెంగళూరు మొదటి వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ (21) ఔటయ్యాడు. సునీల్ నరైన్ వేసిన 5వ ఓవర్ ఐదవ బంతికి క్లీన్ బోల్డ్ అయ్యాడు. 5 ఓవర్లు ముగిసేసరికి 45 రన్స్ చేసింది. 
     

  • 21:57 PM

    బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ చెలరేగుతున్నారు. టీమ్ సౌథీ వేసిన 4వ ఓవర్లో 23 రన్స్ వచ్చాయి. 
     

  • 21:53 PM

    3వ ఓవర్ పూర్తయ్యేసరికి బెంగళూరు వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (13), ఫాఫ్ డుప్లెసిస్ (6) ఉన్నారు. 
     

  • 21:51 PM

    టీమ్ సౌథీ వేసిన రెండో ఓవర్‌లో బెంగళూరు 2 పరుగులు మాత్రమే రాబట్టింది. విరాట్ కోహ్లీ (10), ఫాఫ్ డుప్లెసిస్ (2) క్రీజులో ఉన్నారు.  బెంగళూరు స్కోర్ 12/0. 
     

  • 21:34 PM

    ఫస్ట్ బాల్‌కే ఫోర్
    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌండరీతో తమ ఇన్నింగ్స్ ఆరంభించింది. ఉమేశ్ యాదవ్ విసిరిన తొలి ఓవర్ తొలి బంతిని ఓపెనర్ విరాట్ కోహ్లీ బౌండరీకి తరలించాడు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూ ప్లెసిస్ ఓపెనర్స్‌గా వచ్చారు.

     

  • 21:21 PM

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 రన్స్ చేసింది. శార్దూల్‌ ఠాకూర్ (68), రహ్మనుతుల్లా గుర్బాజ్ (57) హాఫ్ సెంచరీలు చేశారు. రింకు సింగ్ (46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరు బౌలర్లలో డేవిడ్ విల్లే, కర్ణ్‌ శర్మ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. 
     

  • 21:14 PM

    19 ఓవర్లు: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్కోర్ 192/6. శార్దూల్‌ ఠాకూర్ (63) క్రీజులో ఉన్నారు. 
     

  • 21:09 PM

    కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లు ముగిశాయి. సిరాజ్ వేసిన ఈ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. క్రీజులో శార్దూల్‌ ఠాకూర్ (63), రింకు సింగ్ (30) క్రీజులో ఉన్నారు. ప్రస్తుత కోల్‌కతా స్కోరు 175/5.
     

  • 21:00 PM

    టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్‌ ఠాకూర్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇది అతడికి మొదటి ఐపీఎల్ ఫిఫ్టీ.
     

  • 20:54 PM

    16వ ఓవర్ పూర్తయ్యేసరికి కోల్‌కతా ఐదు వికెట్స్ కోల్పోయి 147 పరుగులు చేసింది. క్రీజులో శార్దూల్‌ ఠాకూర్ (47), రింకు సింగ్ (21) ఉన్నారు. 
     

  • 20:51 PM

    ఆల్‌రౌండర్ శార్దూల్‌ ఠాకూర్ దూకుడు పెంచాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ కోల్‌కతా స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 15 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 140-5. 
     

  • 20:46 PM

    14 ఓవర్లు: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్కోర్ 124/5. క్రీజులో శార్దూల్‌ ఠాకూర్ (28), రింకు సింగ్ (18) క్రీజులో ఉన్నారు. 
     

  • 20:35 PM

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. రహ్మనుతుల్లా గుర్బాజ్ (57), ఆండ్రీ రసెల్ (0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు . 12వ ఓవర్లో కర్ణ్ శర్మ ఈ ఇద్దరినీ ఔట్ చేశాడు. 12 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోర్ 94-5. 
     

  • 20:28 PM

    11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మూడు వికెట్ల నష్టానికి 87 రన్స్ చేసింది. రహ్మనుతుల్లా గుర్బాజ్ (55), రింకు సింగ్ (12) క్రీజులో ఉన్నారు. 
     

  • 20:26 PM

    కోల్‌కతా ఓపెనర్ రహ్మనుతుల్లా గుర్బాజ్‌ అర్ధ శతకం పూర్తి చేశాడు. స్పిన్నర్ కర్ణ్‌ శర్మ వేసిన 10వ ఓవర్‌లో సిక్స్ బాది ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ.
     

  • 20:24 PM

    10 ఓవర్లు: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్కోర్ 79/3. క్రీజులో రహ్మనుతుల్లా గుర్బాజ్ (54), రింకు సింగ్ (5) క్రీజులో ఉన్నారు. 
     

  • 20:19 PM

    9 ఓవర్లకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్కోర్ 71/3. రహ్మనుతుల్లా గుర్బాజ్ (47), రింకు సింగ్ (4) క్రీజులో ఉన్నారు. ఈ ఓవర్లో బ్రాస్‌వెల్‌ 14 రన్స్ ఇచ్చాడు. 
     

  • 20:16 PM

    8వ ఓవర్ పూర్తయ్యేసరికి కోల్‌కతా మూడు వికెట్స్ కోల్పోయి 57 పరుగులు చేసింది. క్రీజులో రహ్మనుతుల్లా గుర్బాజ్ (35), రింకు సింగ్ (2) ఉన్నారు. 
     

  • 20:11 PM

    కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లు ముగిశాయి. బ్రాస్‌వెల్‌ వేసిన ఈ ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. రహ్మనుతుల్లా గుర్బాజ్ (30), రింకు సింగ్ (1) క్రీజులో ఉన్నారు. ప్రస్తుత కోల్‌కతా స్కోరు 51/3.
     

  • 20:09 PM

    కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్‌ నితీశ్ రాణా (1) ఔట్ అయ్యాడు. బ్రాస్‌వెల్‌ బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి కీపర్ దినేష్ కార్తిక్‌ చేతికి చిక్కాడు.
     

  • 20:00 PM

    5 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రెండు వికెట్ల నష్టానికి 41 రన్స్ చేసింది. రహ్మనుతుల్లా గుర్బాజ్ (22) నితీష్ రాణా (0) క్రీజులో ఉన్నారు. 
     

  • 19:53 PM

    డేవిడ్ విల్లే వేసిన 4వ ఓవర్ మూడో బంతికి మన్‌దీప్ (0) డకౌట్ అయ్యాడు. దీంతో కివీస్‌ రెండో వికెట్ కోల్పోయింది. 4 ఓవర్లకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్కోరు 26-2. రహ్మనుతుల్లా గుర్బాజ్ (13) నితీష్ రాణా (0) క్రీజులో ఉన్నారు. 
     

  • 19:50 PM

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మొదటి వికెట్ కోల్పోయింది. వెంకటేశ్ అయ్యర్ (18) ఔటయ్యాడు. డేవిడ్ విల్లే వేసిన 4వ ఓవర్ రెండో బంతికి బోల్డ్ అయ్యాడు. 
     

  • 19:48 PM

    3 ఓవర్లకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్కోర్ 26-0. వెంకటేశ్ అయ్యర్ (3), రహ్మనుతుల్లా గుర్బాజ్ (13) క్రీజులో ఉన్నారు. 

  • 19:41 PM

    2 ఓవర్లు: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్కోర్ 12/0. క్రీజులో వెంకటేశ్ అయ్యర్ (2), రహ్మనుతుల్లా గుర్బాజ్ (5) ఉన్నారు. 
     

  • 19:37 PM

    మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి కోల్‌కతా వికెట్ కోల్పోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్ (0), రహ్మనుతుల్లా గుర్బాజ్ (4) ఉన్నారు. 
     

  • 19:34 PM

    కోల్‌కతా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా వెంకటేశ్ అయ్యర్, రహ్మనుతుల్లా గుర్బాజ్ వచ్చారు. హైదరాబాద్ గల్లీ బాయ్ మొహ్మద్ సిరాజ్‌ మొదటి ఓవర్‌ వేస్తున్నాడు.
     

  • 19:28 PM

    ఒకే ఐపీఎల్ ఫ్రాంచైజీకి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు. బెంగళూరు ప్రాంచైజీ తరఫున కోహ్లీ 224 మ్యాచులు ఆడాడు. 
     

  • 19:22 PM

    కోల్‌కతా, బెంగళూరు జట్ల మధ్య ఇప్పటివరకు 30 ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. కోల్‌కతానే 16 సార్లు విజయం సాధించగా.. బెంగళూరు 14 మ్యాచుల్లో గెలిచింది. 

  • 19:15 PM

    ఈ మ్యాచ్ కోసం బెంగళూరు ఒక మార్పు చేసింది. గాయపడిన టాప్లీ స్థానంలో డేవిడ్ విల్లీ జట్టులోకి వచ్చాడు.  
     

  • 19:09 PM

    తుది జట్లు:
    కోల్‌కతా నైట్ రైడర్స్: మన్‌దీప్ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), నితీష్ రాణా( కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి. 
    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మైకేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్. 
     

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x