Get Realme 9i 5G Mobile Just @ Rs.599: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' తన కస్టమర్లకు 'హోలీ' 2023కి ముందే డిస్కౌంట్ ఆఫర్‌లను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లపై కస్టమర్లు భారీగా డబ్బు ఆదా చేసుకుంటున్నారు. జనాలు వేళల్లో డబ్బు ఆదా చేసుకుంటున్నారు. బహుశా మీకు ఈ విషయం గురించి తెలియకపోవచ్చు. మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన ఒక స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువ ధరకు మీకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర కంటే చాలా తక్కువకు మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఈ ఆఫర్ గురించి తెలిసిన కొంతమంది అస్సలు నమ్మలేకపోతున్నారు. ఆ స్మార్ట్‌ఫోన్‌ ఏది, ఆఫర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో డెడ్ చీప్‌గా (Cheapest Realme 5G Smartphone 2023) వచ్చే స్మార్ట్‌ఫోన్ మరేదో కాదు 'రియల్‌మీ 9ఐ 5G' (Realme 9i 5G). రియల్‌మీ 9ఐ 5G స్పెసిఫికేషన్ గురించి మాట్లాడినట్లయితే.. ఇందులో 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. MediaTek Dimensity 810 ప్రాసెసర్‌ని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6 GB RAM మరియు 128 GB స్టోరేజ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో కస్టమర్‌లు 1 TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. 


రియల్‌మీ 9ఐ 5G స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. ఇందులో మొదటి కెమెరా 50 మెగాపిక్సెల్‌లు, రెండవది 2 మెగాపిక్సెల్‌లు కాగా.. మూడవది 2 మెగాపిక్సెల్‌ ఉంటుంది. ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. రియల్‌మీ 9ఐ 5G స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ ఈ కూల్ స్మార్ట్‌ఫోన్‌కు మంచి బ్యాకప్‌ను ఇస్తుంది.


రియల్‌మీ 9ఐ 5G స్మార్ట్‌ఫోన్‌పై మంచి ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఇవ్వబడుతోంది. ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ. 14,400గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,999కి విక్రయించబడుతోంది. మీరు పూర్తి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కండిషన్ బాగుండాలి. పూర్తి ఆఫర్ వర్తిస్తే.. మీరు రూ.14,400 ఆదా చేసుకోవచ్చు. పూర్తి ఎక్స్‌ఛేంజ్ బోనస్ వర్తిస్తే.. రియల్‌మీ 9ఐ 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 599 రూపాయలుకే మీ సొంతం అవుతుంది. ఈ ఆఫర్ కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది.


Also Read: Shubh Rajyog 2023: 700 ఏళ్ల తర్వాత 'శుభ రాజయోగం'.. ఈ రాశుల వారికి ధన వర్షం! కోరుకున్న ఉద్యోగం  


Also Read: International Women’s Day 2023: మహిళా ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌.. బుధవారం సాధారణ సెలవు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి