Cheapest Smartphone India: ఎక్కువ ఫీచర్స్‌తో రూ.10 వేల కంటే తక్కువ ధరలో లభించే ఫోన్స్ ఇవే..
Cheapest Available Smartphones In India Under 10000: మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలావరకు ఎక్కువ ఫీచర్లు తక్కువ ధరలు కలిగిన మొబైల్స్ ని కొనేందుకు ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న తక్కువ ధర కలిగిన ఫోన్ల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
Cheapest Available Smartphones In India Under 10000: స్మార్ట్ ఫోన్ లను వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కొంతమంది అన్ని రకాల ఫీచర్లు కలిగిన హై క్లాస్ ఫోన్లు తీసుకుంటే.. మరికొందరైతే వారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఫోన్ లను కొనుగోలు చేస్తున్నారు. ఈ కామర్ సంస్థలు అన్ని రకాల ఫోన్లను విక్రయిస్తుంది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ అమెజాన్ అధికంగా అమ్ముడుపోయే ఫోన్లలలో బడ్జెట్ ఫోన్ లే అధికంగా ఉండడం విశేషం. మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా వారి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని పదివేల లోపు బడ్జెట్ లో ఉన్న ఫోన్లోనే కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. అయితే మనం ఈరోజు ఈ కామర్స్ సంస్థల్లో విక్రయించే రూ. 10వేల బడ్జెట్ ఫోన్లో వివరాలను తెలుసుకోబోతున్నాం.
అన్ని రకాల ఫ్యూచర్లు కలిగిన పదివేల లోపు బడ్జెట్ ఉన్న ఫోన్లు ప్రస్తుతం 6000 mAh బ్యాటరీ కెపాసిటీతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్లో మంచి కెమెరా క్వాలిటీ, 5జి టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది. పదివేలకు సంబంధించిన బడ్జెట్ ఫోన్లో వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మోటరోలా మోటో ఈ40:
అతి తక్కువ బడ్జెట్లో ఎక్కువగా ఫీచర్లు ఉన్న ఫోన్ లలో మోటరోలా మోటో ఈ40 ఒకటి. ఇది ఫోర్ జి బి రామ్ 64 జిబి స్టోరేజ్ కెపాసిటీతో కేవలం రూ. 8,599 లకే మార్కెట్లో అందుబాటులో ఉంది. కెమెరా విషయానికొస్తే.. 48 ఎంపీ బ్యాక్ కెమెరా కాగా 8 ఎంపీ సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్ కి అమర్చారు.
రియల్ మీ నార్జో 30ఏ:
రియల్ మీ నార్జో సంబంధించిన మోడల్స్ కి మార్కెట్లో విశేష గుర్తింపు లభించింది. ఈ ఫోన్ 3gb రామ్ 32gb ఇంటర్నల్ మెమొరీ తో కేవలం రూ. 8,999 లకే ఈ కామర్స్ సంస్థలు విక్రయిస్తున్నాయి. ఇది 6.1 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో హై క్వాలిటీ తో మీకు లభిస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే 13MP బ్యాక్ కెమెరా కాగా.. 8 ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది.
మైక్రోమ్యాక్స్ ఇన్ 2 బి:
ప్రస్తుతం మార్కెట్లో మైక్రోమ్యాక్స్ ఫోన్లో సేల్స్ తక్కువగా ఉన్నాయి. అయితే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మైక్రోమ్యాక్స్ సంస్థ బడ్జెట్ ఫోన్ లలో వినియోగదారులకు సరికొత్త ఫోన్ ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ వివరాలకు వస్తే హెచ్డి డిస్ప్లేతో 13 మెగాపిక్సల్ నాతో కేవలం మార్కెట్లో రూ.7,999కే అందుబాటులో ఉంది.
Also Read: Ind Vs Ban 2nd ODI: నేడే రెండో వన్డే.. భారత్‌కు చావోరేవో.. ఆ ప్లేయర్‌కు ప్లేస్ కన్ఫార్మ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి