COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cholesterol New Symptoms: శరీరంలోని కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది మంచి కొలస్ట్రాల్ అయితే.. రెండవది చెడు కొలెస్ట్రాల్.. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, చెడు కొలెస్ట్రాల్ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు తెలిపారు. బాడీలో చెడు కొవ్వు పెరగడం వల్ల ప్రధానంగా వచ్చే సమస్యల్లో గుండె జబ్బు ఒకటి..దీంతో పాటు చాలామందిలో పక్షవాతం కూడా వస్తుంది. కాబట్టి శరీరంలో అధికంగా చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తగా పాటించాలి. ప్రస్తుతం చాలామందిలో చెడు కొలెస్ట్రాల్ లక్షణాలను గుర్తించలేకపోవడం వల్ల తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.  ఆధునిక జీవనశైలి కారణంగానే కొత్త కొత్త లక్షణాలు కూడా పుట్టుకొస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. 


కాలిఫోర్నియా యూనివర్సిటీ అందించిన వివరాల ప్రకారం..
ఈ విశ్వవిద్యాలయంలో చెడు కొలెస్ట్రాల్ పై అనేక పరిశోధనలు చేశారు. అయితే చాలామందిలో శరీరంలోని కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా కాళ్లు, తుంటి, తొడల కండరాల నొప్పులు వస్తున్నాయని అధ్యయనాల్లో పేర్కొన్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణమేంటో తెలుసా? 


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..


ఎందుకు ఈ నొప్పులు వస్తున్నాయంటే..
నిజానికి శరీరంలోని ప్రతి మూల రక్తం ప్రవహించడానికి..ధమనులు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ధమనుల్లో కొవ్వు నిలువలు కూడా పేరుకు పోతూ ఉంటాయి. దీనివల్ల ఒక ఫలకం ఏర్పడుతుంది. ఈ ఫలకం రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ప్రభావం చూపుతుంది. ఇలా ఫలకం ఏర్పడిన తర్వాత శరీరానికి రక్తసరఫరా ఆగిపోతుంది. దీని కారణంగా అవయవాల్లో నొప్పులు ఏర్పడి.. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతూ ఉంటారు.


కొలెస్ట్రాల్ కొత్త లక్షణాలు:
కొంతమందిలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వింత వింత లక్షణాలు వస్తున్నాయి. కొంతమందిలో కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా పాదాలు, పిరుదులు, తొడలు కొన్నిచోట్ల కండరాల్లో తీవ్ర నొప్పులు ఏర్పడతాయి. అంతేకాకుండా పాదాలలో నొప్పులు పెరిగిపోయి. నడవడానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. దీంతో పాటు పాదాలు కూడా నీలం రంగులోకి మారతాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నవారు తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. లేకపోతే భవిష్యత్తులో అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter