COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Dangerous Apps In India: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్‌ ఫోన్‌లో చాలా ప్రధానమైనమది. ప్రస్తుతం చాలా మంది స్మార్ట్‌ ఫోన్స్‌లో మాల్వేర్, వైరస్ ప్రవేశించి ఆపరేటింగ్ సిస్టమ్ దెబ్బతింటుంది. దీని కారణంగా మీ డేటా చోరి అవుతోంది. అయితే ఇలాంటి సమస్యలు యాప్‌ల ద్వారానే వస్తున్నాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఈ కింద పేర్కొన్న యాప్‌లను వినియోగిస్తే.. తప్పకుండా వాటిని మీ స్మార్ట్‌ఫోన్‌ నుంచి తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే మీ స్మార్ట్ ఫోన్‌లోని వ్యక్తగత డేటా చోరి అయ్యే ఛాన్స్‌ ఉంది.  


భారత ప్రభుత్వం ఇప్పటికే..Google Play Store నుంచి చాలా రకాల యాప్‌లను తొలగించింది. వీటన్నింటిని 'SpinOK' స్పైవేర్ మాడ్యూల్‌తో తయారు చేశారు. కాబట్టి మీరు చేసే ప్రతి పని యాప్‌ను ఆపరేట్‌ చేసేవారికి తెలిసే ఛాన్స్‌ ఉంది. అయితే ఏయే యాప్స్‌ వినియోగించడం వల్ల మీ వ్యక్తిగత డేటా చోరి అవుతుందోఇప్పుడు తెలుసుకుందాం.  


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్


మీ ఫోన్ నుంచి ఈ యాప్‌లను తొలగించాలి:
Noizz( వీడియో ఎడిటర్ యాప్‌):
ఇప్పటికీ ఈ యాప్‌ను  ప్లే స్టోర్‌లో 100 మిలియన్ కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ చేశారు. కాబట్టి మీరు దీనిని వినియోగించడం వల్ల వ్యక్తిగత డేటా చోరి అయ్యే అవకాశాలున్నాయి. 


Biugo(వీడియో మేకర్ & వీడియో ఎడిటర్): ఈ యాప్‌ విభిన్న రంగుల్లో లభిస్తోంది. ఈ యాప్‌లో అనేక రకాల టెంప్లేట్‌లు  లభిస్తాయి. దీంతో మీరు వీడియో ఎడిటింగ్‌ సులభంగా చేసుకోవచ్చు. ఈ యాప్‌ను ఇప్పటి వరకు 50 మిలియన్ కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ చేశారు. 


VFly(వీడియో ఎడిటర్ & వీడియో మేకర్): ఈ VFly యాప్‌ను కూడా 50 మిలియన్ కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ చేశారు. దీనిని వినియోగించడం కూడా మంచిది కాదని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. 


MVBit - MV(వీడియో స్టేటస్ మేకర్): ఇది ఒక వీడియో ఎడిటింగ్ యాప్..ఇందులో చాలా రకాల ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం దీనిని చాలా మంది వినియోగిస్తున్నారు. ఈ యాప్‌ 50 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. 


Zapya(ఫైల్‌ ట్రాన్ఫర్‌ యాప్‌): ఈ యాప్‌ ద్వారా అన్ని రకాల ప్లాట్‌ఫారమ్‌లలో సులభంగా ఫైల్ షేర్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ 10 కోట్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. దీనిని వినియోగించిన  డేటా చోరి అవుతుందని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. 


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook