Drop Google Pixel 6A Price: మార్కెట్‌లో గూగుల్‌ విడుదల చేసిన స్మార్ట్ ఫోన్‌లకు మంచి డిమాండ్‌ ఉంది. అతి తక్కువ ధరల్లోనే ప్రీమియం ఫీచర్స్‌తో లభించడం వల్ల కంపెనీ లాంచ్‌ చేసిన ఏడాదిలో క్లిక్‌ అయ్యాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌ కెమెరా డిఎస్‌ఎల్‌ఆర్‌ క్వాలిటీతో రావడం వల్ల ఎక్కువ యువత కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మీరు కూడా ఈ గూగుల్‌ కంపెనీ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయంగా భావించవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం దీపావళి సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో పండగ సేల్‌ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా మీరు Google Pixel 6a స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో మీ సొంతం చేసుకోవచ్చు. మొదట ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ MRP రూ.43,999కు లభించింది. అయితే పండగ సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌పై దాదాపు 21 శాతం తగ్గింపుతో రూ. 34,499కే అందుబాటులో ఉంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


ఈ సేల్‌లో భాగంగా Google Pixel 6a మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా  Bank of Baroda క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి Google Pixel 6a స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేసి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.32,499కే పొందవచ్చు. 


ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తోంది. అయితే మీరు  ఆఫర్‌లో కొనుగోలు చేస్తే మీరు వినియోగిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డిస్కౌంట్‌ మీరు ఎక్చేంజ్‌ చేసిన స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌ బట్టి ఆధారపడి ఉంటుంది. మీ మొబైల్‌ కండీషన్‌ బాగుంటే దాదాపు రూ.32,000కే పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్స్‌ పోను మీరు ఈ Google Pixel 6a మొబైల్‌ రూ.2,499కే పొందవచ్చు.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..