Drop Vivo V29 Price: వీవో నుంచి ఇటీవలే విడుదలైన Vivo V29 స్మార్ట్ ఫోన్‌ విక్రయాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మొబైల్‌ ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు  వివో ఇండియా ఇ-స్టోర్‌లో లభించనున్నాయి. కంపెనీ ఈ మొబైల్‌ను రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. 8 GB ర్యామ్‌ వేరియంట్ కలిగి ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 32,999 ఉండగా, 12 GB ర్యామ్‌ వేరియంట్ రూ. 36,999లుగా ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ చాలా రకాల ఫీచర్స్‌తో లభిస్తోంది. అయితే ఈ Vivo V29 మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ  Vivo V29 మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి కంపెనీ 10% క్యాష్‌బ్యాక్ ఆఫర్స్‌ను అందిస్తోంది. దీంతో పాటు మీరు రూ. 4,000 వరకు అదనపు అప్‌గ్రేడ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. ఈ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 28,999కే పొందవచ్చు. అంతేకాకుండా మీరు  12 నెలల పాటు నో-కాస్ట్ EMI ఆప్షన్‌ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌  హిమాలయన్ బ్లూ, మెజెస్టిక్ రెడ్, స్పేస్ బ్లాక్‌ కలర్స్‌లో లభిస్తోంది. ఈ  Vivo V29 మొబైల్‌  స్మార్ట్ ఆరా లైట్ టెక్, 50 మెగాపిక్సెల్ AF సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ స్మార్ట్‌ఫోన్‌ 1260x2800 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ మొబైల్‌ ఫోన్‌ గరిష్టంగా 12 GB ర్యామ్‌, 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో లభిస్తోంది. ఈ Vivo V29 స్మార్ట్‌ ఫోన్‌ Qualcomm Snapdragon 778G చిప్‌సెట్‌ను ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఈ మొబైల్ బ్యాక్‌ సెట్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్  లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ బోకె కెమెరాలను కలిగి ఉంటుంది. 


ఇతర స్పెసిఫికేషన్‌లు:
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌
50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
4600mAh బ్యాటరీ
80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
బయోమెట్రిక్ సెక్యూరీ 
Android 13 ఆధారిత Funtouch OS 13
USB టైప్-సి పోర్ట్
బ్లూటూత్ 5.3


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..