Venus Transits Into Sagittarius: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని సంపాదక గ్రహంగా సాక్షాత్తు లక్ష్మీదేవికి సంబంధ గ్రహంగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ గ్రహం వృచ్చిక రాశిలో సంచార క్రమంలో ఉంది. శుక్రుడు జాతకంలో శుభ స్థానంలో ఉంటే జీవితంలో సంపాదనకు ఎలాంటి లోటు ఉండదు. అయితే శుభ గ్రహంగా పరిగణించే శుక్రుడు జనవరి 18న గురువారం రాత్రి 9 గంటలకు వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ఈ గ్రహ సంచార ప్రభావం పడి.. సంపాదనలో అనేక రకాల అర్హులు రావడమే కాకుండా అదృష్టం విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ శుక్ర గ్రహ సంచారంతో ఏయే రాశి వారికి అదృష్టం రెట్టింపు కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ గ్రహ సంచారం శుభస్థానంలో జరగబోతోంది. కాబట్టి మీరు ఈ సమయంలో అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ సమయం మంచి ఆరోగ్యాన్ని అందించబోతోంది. దీంతోపాటు ప్రేమ జీవితంలో శృంగారం పెరుగుతుంది. సంచారంతో చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా కెరీర్లో మంచి లాభాలు పొందుతారు. వృత్తిపరంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.


మేష రాశి:
శుక్రుడి సంచారం మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు ఇక ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆదాయంలో అనేక మార్పులు వచ్చి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. కొత్త ఆదాయ వనరులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారు పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు పొందుతారు.


Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..


మకర రాశి:
మకర రాశి వారికి కూడా శుక్రుడి సంచారం చాలా ప్రయోజనకరంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరు పెట్టుబడులు పెట్టడం వల్ల అనేక రకాల లాభాలు పొందుతారు. పెద్ద కంపెనీలతో వార ఒప్పందాలు చేసుకుంటారు. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా విహారయాత్రలకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం శృంగార భరితంగా ఉంటుంది. అంతేకాకుండా పూజల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.


Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter