Elon Musks Twitter Jobs Cut: భారతదేశంలో తొలగింపులను ప్రారంభించింది ట్విట్టర్. శుక్రవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల తొలగింపులు చేపట్టినట్లు ప్రకటించింది. ఎలాన్ మస్క్ గత వారం ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో పాటు సీఎఫ్‌ఓ, మరికొందరు ఉన్నతాధికారులను తొలగించిన విషయం తెలిసిందే. గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించే క్రమంలో భారత్‌లోనూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టింది. దీనికి సంబంధించి ఉద్యోగులందరికీ వ్యక్తిగతంగా ఇమెయిల్ పంపనున్నట్లు కంపెనీ తెలిపింది. ట్విట్టర్‌లో కొనసాగే ఉద్యోగులకు.. సాగనంపే ఉద్యోగులకు మెయిల్స్ ద్వారా తెలియజేస్తామంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్విట్టర్ యాడ్స్ ఉద్యోగులు, మార్కెటింగ్, హెచ్ఆర్ టీమ్, ఇతర సిట్టింగ్ ఉద్యోగులు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈమెయిల్ వచ్చిన కొద్దిసేపటికే చాలా మంది వ్యక్తులు ట్విట్టర్‌కు వీడ్కోలు పలికామని కొందరు ఉద్యోగులు తెలిపారు.'మీరు కార్యాలయంలో ఉంటే లేదా కార్యాలయానికి వెళితే.. దయచేసి ఇంటికి వెళ్లండి..' అని మెయిల్ వచ్చిందని చెప్పారు. ఈ మెయిల్ అందినప్పటి నుంచి కంపెనీ ఉద్యోగుల్లో ఆందోళన, అనిశ్చితి వాతావరణం నెలకొంది. సినిమా స్టైల్లో ఎలెమ మస్క్ మెయిల్ పంపించారని నెటిజన్లు అంటున్నారు.


44 బిలియన్ డాలర్లు వెచ్చించి ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు ఎలెన్ మస్క్. తాను పెట్టిన పెట్టుబడిని తిరిగి సంపాదించేందుకు అనేక మార్పులు చేస్తున్నారు. ఇందులో కంపెనీలో టాప్ ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. కిందిస్థాయి సిబ్బందిని కూడా సగానికి సగం ఇళ్లకు పంపించేశారు. అంతేకాకుండా బ్లూటిక్ కోసం నెల 8 డాలర్లు చెల్లించాల్సిందేనని కండిషన్ పెట్టారు. ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు అమెరికాలోనే కాకుండా ప్రపంచమంతటా కనిపిస్తోంది. ఈ నిర్ణయం తర్వాత టెక్ రంగంలో పెద్ద ఉద్యోగ సంక్షోభం ఏర్పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 


50% ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లోని 50 శాతం మందిని తొలగిస్తారని చాలా కాలంగా మీడియాలో జరుగుతున్న ప్రచారమే నిజం కానుంది. కంపెనీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావడానికి ట్విట్టర్ ఈ చర్య తీసుకుంటోంది. 


Also Read: Pawan Kalyan: ఇప్పటంలో ఇళ్లు కూలిస్తే.. ఇడుపాలయలో హైవే వేస్తాం.. పవన్ కళ్యాణ్ వార్నింగ్  


Also Read: Karnataka: ఆటో, ట్రక్కు ఢీ... ఏడుగురు మహిళలు మృతి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి