Emergency Alert Message: మీ మొబైల్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా..? అసలు విషయం ఇదే..!
Emergency Alert On Mobile: దేశవ్యాప్తంగా మొబైల్స్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. దీంతో చాలా మంది ఏంటో అని కంగారు పడుతున్నారు. అయితే ఈ మెసేజ్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసలు అర్థం ఇదే..!
Emergency Alert On Mobile: మీ మొబైల్‌కి ఇందాక ఎమర్జెన్సీ మెసేజ్ అలర్ట్ మెసేజ్ వచ్చిందా..? అయితే కంగారు పడొద్దు. దేశ వ్యాప్తంగా మొబైల్ స్క్రీన్‌లపై ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. దీంతో చాలా మంది ఉలిక్కిపడి.. ఏమైందోనని భయాందోళనలకు గురయ్యారు. టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్‌ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. దీంతో మనకు మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్‌ప్లేపై ప్రత్యక్షమైంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అనుబంధంతో ఈ టెస్టింగ్ జరిగింది. భవిష్యత్‌లో ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను అలర్ట్ చేయడానికి ట్రయల్ టెస్ట్ నిర్వహించారు.
ఆ మెసేజ్‌లో ఏముందంటే.. "ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపబడిన శాంపిల్ టెస్ట్ మెసేజ్. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. మీ నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ TEST Pan-India ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ నుంచి పంపించబడింది. ఇది ప్రజల భద్రతను మెరుగుపరచడంతో పాటు అత్యవసర సమయాల్లో సకాలంలో హెచ్చరికలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది" అని అందులో ఉంది. మొదట ఇంగ్లిష్ భాషలో అలర్ట్ రాగా.. తరువాత తెలుగు, హిందీ భాషల్లో కూడా ఎమర్జెన్సీ అలర్ట్ సందేశం వచ్చింది.
అత్యవసర పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఒకేసారి అలర్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ వ్యవస్థను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే అందరినీ అలర్ట్ చేస్తూ.. టెస్టింగ్ మెసేజ్ పంపించింది. మొబైల్ ఆపరేటర్లు, సెల్ బ్రాడ్ కాస్టింగ్ వ్యవస్థలకు సంబంధించిన ఎమర్జెన్సీ అలర్ట్ సామర్థ్యాన్ని, ఎఫెక్ట్‌ను అంచనా వేస్తోంది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇలాంటి అలర్ట్ మెసేజ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర టెలి కమ్యూ నికేషన్ విభాగం తెలిపింది. వరదలు వచ్చినప్పుడు.. భూకంపాలు సంభవించినప్పుడు.. సునామీ సహా పలు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసి.. కాపాడేందుకు కేంద్రం ఇలాంటి హెచ్చరికలు పంపించనుంంది. ఇప్పటికే జూలై 20, ఆగస్టు 17న కూడా కేంద్రం ఎమర్జెన్సీ మెసేజ్‌లు పంపించింది. తాజాగా నేడు మరోసారి టెస్ట్ చేసింది.
Also Read: Bigg Boss Season 7 Telugu: ఛీఛీ రతిక కూడానా.. ప్రిన్స్ యావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బ్యూటీ
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook