Best Offers on Apple, Moto, OPPO, Redmi and Google Smartphones in Flipkart Big Billion Days Sale: తక్కువ ధరలో మీరు టాప్ బ్రాండ్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే మీ నిరీక్షణ త్వరలోనే తెరపడనుంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' తన వినియోగదారుల కోసం త్వరలోనే భారీ ఆఫర్స్ ప్రకటించనుంది. దసరా సందర్భంగా 'బిగ్ బిలియన్ డేస్' సేల్‌ను త్వరలోనే ఆరంబించనుంది. ఇందులో మీరు భారీ డిస్కౌంట్‌తో టాప్ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' ఇప్పటికే తన సైట్‌లో ఓ యాడ్ ఉంచింది. త్వరలోనే 'బిగ్ బిలియన్ డేస్' సేల్ ఆరంభం కానుందని పేర్కొంది. ప్రతి వస్తువుపై భారీ తగ్గింపు ఉన్నట్టు ప్రకటించింది. కొన్ని వస్తువులపై 80 శాతం ఆఫర్ కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. Apple, Motorola, OPPO, MI, Samsung, Realme, Vivo, OnePlus లాంటి టాప్ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ యొక్క గొప్ప ఆఫర్లు వీటిపై ఉంటాయో ఓసారి చూద్దాం.


Redmi Note 10 Pro Max: 
Redmi Note 10 Pro Max 5G స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్ సమయంలో కేవలం రూ. 14,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 5020mAh బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే మరియు స్నాప్‌డ్రాగన్ 732G ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 108MP బ్యాక్ కెమెరా కూడా ఉంది. 


Moto G52: 
Motorola G52 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. సేల్ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 12,599 ధరకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. 


iPhone 13:
iPhone 13 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ గొప్ప అవకాశం. ప్రస్తుతానికి iPhone 13 ఎంత తగ్గింపుతో విక్రయించబడుతుందో తెలియదు. అయితే భారీ తగ్గింపు ఉంటుందని తెలుస్తోంది. 


Oppo Reno 8 5G: 
అద్భుతమైన ఫీచర్లు మరియు స్టైలిష్ డిజైన్‌తో వచ్చిన Oppo Reno 8 5G స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో చౌకగా డాకించుకోవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 26,999గా ఉంటుందని తెలుస్తోంది.  అంతేకాదు అనేక బ్యాంక్ ఆఫర్లను సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఫ్లిప్‌కార్ట్ ఇవ్వబడుతుంది. 


Google Pixel 6a: 
ఇటీవల విడుదల చేసిన Google తాజా 5G స్మార్ట్‌ఫోన్ Google Pixel 6a. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో విక్రయించబడుతుంది. రూ. 43,999 ధరతో విడుదల చేయబడిన ఈ ఫోన్‌ను అన్ని ఆఫర్‌ల తర్వాత రూ. 27,699కి అందుబాటులో ఉంటుంది. 


Also Read: Dinesh Karthik: కలలు నిజమవుతాయి.. దినేశ్‌ కార్తీక్‌ భావోద్వేగం! ఆ ఒక్క మాటతో


Also Read: 'రెబల్ స్టార్' ప్రభాస్‌కు అరుదైన గౌరవం.. తొలి సౌతిండియా స్టార్‌గా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook