Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ప్లస్, గెలాక్సీ ఎస్ 23 5జితో పాటు ఇతర గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబర్ 23 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభానికి అంతా సిద్ధమౌతోంది. సేల్ ప్రారంభానికి ముందే కొన్ని డీల్స్ గురించి ప్లిప్‌కార్ట్ ప్రకటించింది. ప్రతి రోజూ ప్రముఖ బ్రాండెడ్ ఫోన్లపై ఇచ్చే డీల్స్ గురించి వివరిస్తోంది. ఇవాళ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ గురించి ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ప్లస్, గెలాక్సీ ఎస్ 23 5జి స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ అందించనుంది. 


అయితే ఫ్లిప్‌కార్ట్ అందించే ఈ డిస్కౌంట్‌లో బ్యాంక్ కార్డు, ఎక్స్చేంజ్, ప్రీ ఆర్డర్, క్యాష్‌బ్యాక్ వంటివన్నీ కలిపే ఉంటాయి. ఏ ఆఫర్ ఎంత ఉంటుందనేది ఫ్లిప్‌కార్ట్ సేల్ ప్రారంభయ్యాకే..కొనుగోలు సమయంలో తెలుస్తుంది. 


శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 23 5జి ఈ ఏడాది మార్చ్ నెలలో లాంచ్ అయింది. ఈ ఫోన్ మీకు 10, 999 రూపాయలకు లభించనుంది. అసలు ధర 17,499 రూపాయలుగా ఉంది. ఫ్లిప్‌కార్ట్ 6500 డిస్కౌంట్ అందించనుంది. ఇక గెలాక్సీ ఎఫ్ 13 అయితే 8,499 రూపాయలకు లభించవచ్చు.


శాంసంగ్ ప్రీమియం గెలాక్సీ ఎస్ 22 ప్లస్ 59,999 రూపాయలుంది. ఇండియాలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రకటన 84,999 రూపాయలతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ఫోన్ 77,970 రూపాయలకు లభిస్తోంది. ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 60 వేలకు లభించనుంది. 


అదే విధంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ 5జి ధర ప్రస్తుతం 49,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్డ్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా 31, 999 రూపాయలకు లభిస్తోంది. 


Also read: Pension Scheme: వృద్ధాప్యంలో గ్యారంటీ ఆదాయం, నెలకు వేయి రూపాయల పెట్టుబడితో..నెలకు 21 వేల పెన్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok