Pension Scheme: వృద్ధాప్యంలో గ్యారంటీ ఆదాయం, నెలకు వేయి రూపాయల పెట్టుబడితో..నెలకు 21 వేల పెన్షన్

Pension Scheme: వృద్ధాప్యంలో ఎప్పుడూ ఆదాయం ఉండేట్టు చూసుకోవాలి. సరైన ప్లానింగ్ ఉంటే ఇది సాధ్యమే. నెలకు వేయి రూపాయలు పెట్టుబడితో..రిటైర్మెంట్ అనంతరం నెలకు 20 వేలు పొందే అవకాశముంది. అదెలాగంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 17, 2022, 02:41 PM IST
Pension Scheme: వృద్ధాప్యంలో గ్యారంటీ ఆదాయం, నెలకు వేయి రూపాయల పెట్టుబడితో..నెలకు 21 వేల పెన్షన్

Pension Scheme: వృద్ధాప్యంలో ఎప్పుడూ ఆదాయం ఉండేట్టు చూసుకోవాలి. సరైన ప్లానింగ్ ఉంటే ఇది సాధ్యమే. నెలకు వేయి రూపాయలు పెట్టుబడితో..రిటైర్మెంట్ అనంతరం నెలకు 20 వేలు పొందే అవకాశముంది. అదెలాగంటే..

బెస్ట్ సెక్యూర్డ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే ఇది మీ కోసమే. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ ఇది. ఈ స్కీమ్ ఆధారంగా వృద్ధాప్యాన్ని సెక్యూర్ చేసుకోవచ్చు. రిటైర్మెంట్ తరువాత పెద్ద మొత్తంలో పెన్షన్ అందించే స్కీమ్ ఇది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఈ స్కీమ్ పేరు నేషనల్ పెన్షన్ స్కీమ్. వృద్ధులకు ప్రయోజనం కల్గించేది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడంలో ఏ మాత్రం రిస్క్ లేదు. 2004 జనవరిలో ఈ స్కీమ్‌ను ప్రభుత్వ సిబ్బంది కోసం ప్రారంభించారు. ఆ తరువాత 2009లో అందరికీ వర్తించేలా మార్పులు చేశారు. ఈ స్కీమ్ కింద దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో మీరు 40 శాతం డబ్బుల్ని యాన్యుటీలో పెడతారు. మున్ముందు ఇది మీకు పెన్షన్ రూపంలో అందుతుంది. 

ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే..నెలకు కేవలం 1000 రూపాయలతో ప్రారంభించవచ్చు. 18-70 ఏళ్ల వరకూ ఈ స్కీమ్ ప్రయోజనం పొందవచ్చు. 20 ఏళ్ల వయస్సులో నెలకు 1000 రూపాయలు పెట్టుబడి పెడితే..రిటైర్మెంట్ తరువాత మొత్తం 5.4 లక్షల నగదు జమ అవుతుంది. దీనిపై 10 శాతం రిటర్న్ వస్తుంది. ఫలితంగా 1.05 కోట్లవుతుంది. ఇందులో 40 శాతం కార్పస్ ఫండ్ కిందకు మార్చితే..42.28 లక్షలౌతుంది. ఈ లెక్కల పది శాతం ఏడాదికంటే ప్రతి నెలా 21, 140 రూపాయలు పెన్షన్ అందుతుంది. దాంతోపాటు 63.41 లక్షలు ఒకేసారి అందుతాయి.

నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే..చివర్లో 60 శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. అది ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. ఎన్‌పీఎస్ ఎక్కౌంట్‌లో కంట్రిబ్యూషన్ పరిధి 14 శాతంగా ఉంటుంది. 

Also read: Best Ac In India: AC కొనాలనుకుంటే ఇదే బెస్ట్ డీల్‌.. డైకిన్ ఏసీలపై భారీ డిస్కౌంట్లు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Trending News