Flipkart Black Friday Sale: 50 అంగుళాల స్మార్ట్ టీవీలు కేవలం రూ.27వేలకే.. ఎగబడి మరి కొంటున్న వినియోగదారులు
Flipkart Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా చాలా చౌక ధరలే లభిస్తున్నాయి. అంతేకాకుండా భారీ డిస్కౌంట్స్‌తో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Flipkart Black Friday Sale: యూఎస్‌లో జరిగే బ్లాక్ ఫ్రైడే సేల్.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కూడా కొనసాగుతోంది. ఈ సెల్ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఈ రోజు కూడా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో వస్తువులను కొనుగోలు చేయోచ్చు. అయితే ఈ సేల్ భాగంగా అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ లభించనుంది. ప్రస్తుతం అందరూ స్మార్ట్ టీవీలను వినియోగిస్తున్నారు. థియేటర్ లాంటి అనుభూతిని పొందేందుకు 50 అంగుళాల టీవీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ టీవీలు కంపెనీని బట్టి రేట్లు కలిగి ఉంటాయి. ఈ 50 అంగుళాలు గల టీవీ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా చాలా చౌకగా లభిస్తున్నాయి.
ఈ టీవీలపై భారీ ఆఫర్స్:
థామ్సన్ OATHPRO మాక్స్ (50 అంగుళాల స్మార్ట్ టీవీ):
థామ్సన్ OATHPRO Max 50 అంగుళాల స్మార్ట్ టీవీ 4k డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ టీవికి 40 వాట్స్ పవర్ ఫుల్ స్పీకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక దీని ధర విషయానికొస్తే.. రూ. 46,999 కాగా.. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 25,999కే లభిస్తోంది. అయితే ఇంకా డిస్కౌంట్ పొందాలనుకుంటే.. సిటీ బ్యాంక్ లేదా కోటక్ బ్యాంక్ కార్డును ఉపయోగిస్తే రూ. 1,500 తగ్గింపు లభిస్తుంది. దీంతో టీవీ ధర రూ.24,999 అవుతుంది. అంతేకాకుండా దీనిపై రూ.11,000 విలువుగల ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. కండిషన్‌ను బట్టి మీరు టీవీని ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.11,000 దాకా డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో టీవీ ధర రూ. 13,499 అవుతుంది.
కడక్ CA ప్రో (50 అంగుళాల స్మార్ట్ టీవీ):
కడక్ CA ప్రో 50 అంగుళాల స్మార్ట్ టీవీ రూ. 46,499కే అందుబాటులో ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.26,999కి లభిస్తోంది. సిటీ బ్యాంక్ లేదా కోటక్ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేస్తే..రూ. 1500 తగ్గింపు పొందుతారు. ఆ తర్వాత టీవీ ధర రూ.25,499 అవుతుంది. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను వినియోగిస్తే దాదాపు రూ.11,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.
Blaupunkt సైబర్‌సౌండ్ (50 అంగుళాల స్మార్ట్ టీవీ):
Blaupunkt సైబర్‌సౌండ్ 50 అంగుళాల స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 47,999 కాగా.. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 28,999కి లభిస్తోంది. ఇక బ్యాక్ ఆఫర్ల విషయాని కొస్తే.. సిటీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగింస్తే రూ.1500 తగ్గింపు లభిస్తుంది. దీంతో టీవీ ధర రూ.27,499 అవుతుంది. అంతేకాకుండా ఈ టీవీకి ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో దాదాపు రూ.11,000 డిస్కౌంట్ పొందొచ్చు.
నోకియా (50 అంగుళాల స్మార్ట్ టీవీ):
నోకియా 50 అంగుళాల స్మార్ట్ టీవీ రూ. 50,000 కాగా.. అయితే ఈ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 34,999కే అందుబాటులో ఉంది. దీనిని సిటీ, కోటక్ బ్యాంక్ కార్డ్ ఉపయోగిస్తే.. రూ. 1500 ఆఫ్ పొందుతారు. దీంతో ఈ టీవీ రూ.33,499కే లభిస్తోంది.
Also Read : Watch Now: కాటేసే నాగరాజుకే కిస్ ఇచ్చిన బలరాజు..నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో.
Also Read : Rhino In Football Ground: ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook