iPhone 13: మరోసారి తగ్గిన ఐఫోన్ 13 ధర, ఊహించని అతి తక్కువ ధరకు ఐఫోన్ 13 లభ్యం
iPhone 13: ఐఫోన్ 14 కంటే ఇప్పుడు ఐఫోన్ 13 అమ్మకాలు అధికమయ్యాయి. ఐఫోన్ 13 కొనుగోలుకు ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. ఫ్లిప్‌కార్ట్‌పై ధర మరింతగా తగ్గింది.
ఐఫోన్ 13 కొనాలని ఆలోచిస్తే..ఇదే మేంచి అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు ఐఫోన్ 13 మరింత తగ్గింది. అందుకే ఇప్పుడు ఐపోన్ 13 మీరు ఊహించనంత తక్కువ ధరకు లభ్యం కానుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో దసరా, దీపావళి ప్రత్యేక ఆఫర్లు ముగిసినా..కొన్ని బ్రాండ్లపై ఇంకా డిస్కౌంట్ ఆఫర్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 13 పై భారీ డిస్కౌంట్ ఇంకా అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం 66,990 రూపాయలకు లభ్యం కానుంది. అసలు ధర మాత్రం 70,000 గా ఉంది. 4 శాతం డిస్కౌంట్ అనంతరం 66 వేలకు లభిస్తోంది.
ఐఫోన్ 13 కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 కొనుగోలుపై 18,500 రూపాయలు ఎక్స్చైంజ్ ధర ఉంది. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ధర పూర్తిగా వర్తిస్తే..ఐఫోన్ 13 ధర కేవలం 48,490 రూపాయలు మాత్రమే. ఒకవేళ ఐఫోన్ 13 కొనే ఆలోచన ఉంటే ఈ డీల్ మళ్లీ మీకు దక్కదు. అందుకే ఆఫర్ ముగిసేలోగా వెంటనే ఐఫోన్ 13 మీ సొంతం చేసుకోండి.
Also read: BCCI: బీసీసీఐ సరికొత్త నిర్ణయం, ఇకపై మహిళా క్రికెటర్లకు సైతం సమాన వేతనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook