iPhone 15 Price Drop: ఆపిల్ ఉత్పత్తులంటే అందరికీ చాలా ఇష్టమే. అందులో ఐఫోన్ అంటే ఇష్టపడనివారుండరు. కానీ ధర ఎక్కువగా ఉండటంతో అందరూ వెనుకంజ వేస్తుంటారు. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 15 సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం లభిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఐఫోన్ 16 నడుస్తోంది. ఐఫోన్ 15 సెప్టెంబర్ 2023లో విడుదలైనప్పుడు ధర 69,900 రూపాయలుగా ఉంది. అయితే ఇప్పుడు ఇదే మోడల్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో 12 శాతం డిస్కౌంట్ నడుస్తోంది. డిస్కౌంట్ తరువాత 60,999 రూపాయలకు లభించనుంది. ఇక బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 1000 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ రెండు ఆఫర్లు కలుపుకుంటే ఐఫోన్ 15 ధర 59,900 రూపాయలైంది. ఇక ఇప్పుడు మిగిలిన మరో ఆఫర్ ఎక్స్చేంజ్. మీ వద్ద పాత ఐఫోన్ కండీషన్‌లో ఉంటే ఎక్స్చేంజ్‌లో భాగంగా 46,950 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఇది మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ మోడల్, కండీషన్ బట్టి ఉంటుంది. 


ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ధర పూర్తిగా లభిస్తే ఐఫోన్ 15 కేవలం 25 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 15 అనేది 6.1 ఇంచెస్ ఓఎల్ఈడీ సూపర్ రెటీనా డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో ఏ16 బయోనిక్ చిప్, 6 కోర్ ప్రోసెసర్, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, డైనమిక్ ఐల్యాండ్ నాచ్ డిస్‌ప్లే, 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంటాయి. 


ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 17 లాంచ్ కావచ్చు. ఈసారి ఐఫోన్ 17 మునుపటి మోడల్స్ కంటే భిన్నంగా ఉండవచ్చని తెలుస్తోంది. ఆర్ఠిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అత్యధికంగా ఉండే అవకాశాలున్నాయి. 


Also read: ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకు టీమ్ ఇండియా జట్టులో ఎవరికి అవకాశం, ఎవరికి నో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.