Flipkart Smartphone Offers: ఇటీవల స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో క్రమక్రమంగా వాటా పెంచుకుంటున్న చైనా కంపెనీ పోకో స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది. అది కూడా 12జీబీ ర్యామ్, 108 పిక్సెల్ కెమేరా సామర్ధ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువ ధరకే లభించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Poco X6 Neo 5G స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ముందు ఈ ఫోన్ ఫీచర్లు , ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ 6.7 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌‌డి ప్లస్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇక ఈ ఫోన్ టచ్ రేట్ అయితే 240 హెర్ట్జ్ ఉంది. 1000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండంట వల్ల అద్భుతమైన రిజల్యూషన్, క్లారిటీ ఉంటుంది. అంతేకాకుండా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 6ఎన్ఎం చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇక Mali G57 MC2 GPU గ్రాఫిక్స్ కార్డ్ సపోర్ట్ చేయడంతో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. మరోవైపు Poco X6 Neo 5Gలో ఇన్‌ఫ్రారెడ్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లు ఉన్నాయి. డాల్బీ ఎట్మోస్ సపోర్టెడ్ సౌండ్ సిస్టమ్ కావడంతో మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ చేస్తూ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంటుంది. 


ఇక కెమేరా విషయానికొస్తే డ్యూయల్ రేర్ కెమేరా సిస్టమ్ కలిగి ఉంటుంది. 108 మెగాపిక్సెల్ ప్రో గ్రేడ్ మెయిన్ కెమేరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమేరా ఉంటాయి. వీటిలో పోర్ట్రెయిట్ మోడ్, నైడ్ మోడ్, వాయిస్ షట్టర్, ఫిల్మ్ ఫిల్టర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఇందులో 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ఉన్నాయి.


Poco X6 Neo 5Gపై భారీగా 27 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగిన ఫోన్ దర 17,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్‌లో 15,999 రూపాయలకు అందుబాటులో ఉంది. అది కాకుండా 1000 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. దాంతో ఈ ఫోన్ కేవలం 14,999 రూపాయలకే లభించనుంది.


Also read: Ys Jagan: జూన్ 6న ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం, ఫలితం జగన్‌కు తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook