Flipkart Offers: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ పోకోకు ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతోంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. మన్నిక కూడా బాగుండటంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో  నుంచి POCO C65పై ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. లాంచింగ్ ధరపై ఏకంగా 38 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ 6.74 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 1650*720 రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇక ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్రాస్ 3 ఉంటుంది. ఈ ఫోన్ మీడియో టెక్ హీలియో జి 85 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్‌పోన్‌లో 4జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. 


ఇక కనెక్టివిటీ అయితే బ్లూటూత్, డ్యూయల్ బాండ్ వైఫై, యూఎస్‌బి టైప్ సి పోర్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇది 4జీ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 5జి సపోర్ట్ చేయదు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 


ఇక కెమేరా చాలా ప్రీమియం ఫోన్లను తలదన్నుతుంది. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమేరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉంటాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో 38 శాతం డిస్కౌంట్ అనంతరం  6799 రూపాయలకు లభించనుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్ ఇన్ని ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 6500 రూపాయలకే లభించనుంది.


Also read: iPhone 16: కొత్త క్యాప్చర్ బటన్‌తో ఐఫోన్ 16, లాంచ్ ఎప్పుడు, ధర ఎంతంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook