iPhone 16: కొత్త క్యాప్చర్ బటన్‌తో ఐఫోన్ 16, లాంచ్ ఎప్పుడు, ధర ఎంతంటే

iPhone 16: ఆపిల్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 లాంచ్ సమయం సమీపిస్తోంది. అప్ డేటెడ్ ఫీచర్లతో లాంచ్ కానున్న ఐఫోన్ 16 గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 23, 2024, 03:19 PM IST
iPhone 16: కొత్త క్యాప్చర్ బటన్‌తో ఐఫోన్ 16, లాంచ్ ఎప్పుడు, ధర ఎంతంటే

iPhone 16: ఆపిల్ కంపెనీ ప్రతియేటా నిర్వహించే వర వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024 పూర్తయింది. ఇక సెప్టెంబర్ నెలలో ఐపోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఆపిల్ వాచ్, ఐ ప్యాడ్ విడుదల కానున్నాయి. ఈ నేపధ్యంలో అందరూ ఐఫోన్ 16 ఫీచర్లు ఎలా ఉంటాయి, ధర ఎంత ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపిల్ కంపెనీ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఐఫోన్ 16 త్వరలో లాంచ్ కానుంది. ఐవోఎస్ 18 అప్‌డేట్‌తో లాంచ్ కానున్న ఐఫోన్ 16 గత మోడల్స్ కంటే భిన్నంగా 6.1 ఇంచెస్ కాకుండా 6.3 ఇంచెస్ స్క్రీన్ ఉండవచ్చు. గత మోడల్ డిస్‌ప్లే రేషియోతో పోలిస్తే ఐఫోన్ 16లో కాస్త ఎక్కువే ఉంటుంది. కొత్త మైక్రో లెన్స్ అర్రే ఓఎల్ఈడీ టెక్నాలజీ వినియోగించనుండటంతో స్క్రీన్ గతం కంటే 20 శాతం ప్రకాశవంతంగా ఉంటుంది. 1200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది.

ఐఫోన్ 16లో కూడా టైటానియం ఫ్రేమ్ ఉంటుంది. ఇది 1.2 మిల్లీమీటర్ల బెజెల్స్‌తో అత్యంత నాజూగ్గా ఉంటుంది. ఫేస్ ఐడీ డిస్‌ప్లేలోపల ఉండవచ్చు. ఐఫోన్ 16లో కూడా టైటానియం ఫ్రేమ్‌తో పాటు యూఎస్‌బి సి పోర్ట్ ఉండవచ్చు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా వాల్యూమ్, పవర్, కెమేరా కోసం సరికొత్త క్యాప్చర్ బటన్ కన్పించనుంది. ఇక కెమేరా పరంగా చూస్తే ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా ఉంటుంది. అల్ట్రా వైడ్ కెమేరా 12 మెగాపిక్సెల్ నుంచి 48 మెగాపిక్సెల్‌కు మార్చారు. 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ అనుభూతినిచ్చే పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. ఇందులో టైటానియం బ్లూతో పాటు స్పేస్ బ్లాక్, వైట్, గ్రే, రోజ్ కలర్స్ ఉన్నాయి. 

ఐఫోన్ 16 సెప్టెంబర్ 3 నుంచి 11 మధ్య తేదీల్లో లాంచ్ కావచ్చని అంచనా ఉంది. లాంచ్ చేసిన వారం రోజుల్లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఐఫోన్ 16 ధర అమెరికాలో 999 డాలర్ల నుంచి ప్రారంభం కావచ్చు. 

Also read; Iron Deficiency: ఐరన్ లోపిస్తే ఈ 4 వ్యాధుల ముప్పు, తస్మాత్ జాగ్రత్త

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News