గూగుల్ స్మార్ట్‌ఫోన్ రేంజ్‌లో గూగుల్ పిక్సెల్ 6ఎ ఒక ఫ్లాగ్‌షిప్ మోడల్. ఇప్పుడీ స్మార్ట్‌‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 44 వేల రూపాయల స్మార్ట్‌ఫోన్..కేవలం 13 వేలకే సొంతం చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గూగుల్ పిక్సెల్ 6ఎ ప్రీమియం స్మార్ట్‌ఫోన్. మార్కెట్‌లో ఇటీవలే లాంచ్ అయింది. మార్కెట్‌లో లాంచ్ అయినప్పటినుంచి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ స్మార్ట్‌ఫోన్ కెమేరా, డిస్‌ప్లే, సామర్ద్యం కస్టమర్లను విపరీతంగా ఆాకట్టుకుంటోంది. ధర ఎక్కువ కావడంతో చాలామంది కొనేందుకు ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఇదే స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఫలితంగా 15వేల కంటే తక్కువకే ఈ స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు.


గూగుల్ పిక్సెల్ 6ఎ ఫీచర్లు


గూగుల్ పిక్సెల్ 6ఎ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ గూగుల్ టెన్సార్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 4410 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం మరో ప్రత్యేకత. 6.14 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఓఎల్‌డి డిస్‌ప్లే కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 5జి సౌకర్యంతో డ్యూయల్ కెమేరాతో ఉంది. ఇందులో ప్రధాన సెన్సార్ 12.2 మెగాపిక్సెల్ కాగా రెండవది 12 మెగాపిక్సెల్ ఉంది. ఈ ఫోన్‌లో మీకు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా ఉంది. ఇందులో ఆడియో జాక్ లేదు. కానీ గూగుల్ పిక్సెల్ 6ఎ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. 


ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్ గురించి పరిశీలిస్తే..గూగుల్ పిక్సెల్ 6ఎ అతి తక్కువ ధరకే పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర దాదాపుగా 44 వేల రూపాయలు. కానీ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై 20 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఫలితంగా 34,999 రూపాయలకు లభిస్తోంది. ఇది కాకుండా..21,500 రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ ఇస్తున్నారు. ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే..ఈ స్మార్ట్‌ఫోన్ మీకు కేవలం 13099 రూపాయలకే లభించనుంది. కస్టమర్లకు ఇంతకంటే తక్కువకు ఇలాంటి ఫోన్ లభించదు. ఈ ఆఫర్ పొందేందుకు ఇప్పుడు పరిమిత వ్యవధి మాత్రమే మిగిలుంది.


Also read: Post Office Scheme: అద్భుతమైన పోస్టాఫీసు పథకం, 5 ఏళ్లలో 14 లక్షల రూపాయలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook