42 percent discount Offer on Vu Premium 43 Inch Ultra HD LED Smart TV in Flipkart: కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం తగ్గించారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది స్మార్ట్ ​టీవీల్లోనే ఎంటర్​టైన్​మెంట్‌ను​ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలు, వెబ్ ​సిరీస్​లు, యూట్యూబ్​, క్రికెట్.. ఇలా అన్ని స్మార్ట్ ​టీవీల్లోనే చూస్తూ ఆస్వాదిస్తున్నారు. అందుకే పలు స్మార్ట్ టీవీ సంస్థలు కూడా తక్కువ బడ్జెట్ ధరలోనే టీవీలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్‌జీ, సామ్‌సంగ్, షావోమి, వీయూ, టీసీఎల్ వంటి పలు కంపెనీలు తక్కువ బడ్జెట్ ధరలోనే 32, 40, 43, 50, 55, 60, 65 ఇంచెస్ స్మార్ట్ ​టీవీలను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. దసరా పండగ ఆఫర్‌లో భాగంగా 'వీయూ' తక్కువ బడ్జెట్ ధరలోనే టీవీలను అందిస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 43 ఇంచ్ టీవీని సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచింది. వీయూ ప్రీమియం 43 ఇంచ్ టీవీ అసలు ధర రూ. 45, 000లుగా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీపై 42 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. ఇప్పుడు వీయూ ప్రీమియం 43 ఇంచ్ టీవీ 25,990లకు అందుబాటులో ఉంది. 


వీయూ ప్రీమియం 43 ఇంచ్ టీవీపై బ్యాంక్ ఆఫర్‌ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ఆక్సిస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. మరోవైపు ఈ టీవీపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 16,900 వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఇస్తే.. కేవలం రూ. 9,090లకి సొంతం చేసుకోవచ్చు. అయితే మీ పాత స్మార్ట్‌ టీవీ కండిషన్ బాగుంటేనే రూ. 16,900 వస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేస్తే కేవలం రెండు రోజుల్లో వీయూ టీవీ మీ ఇంట్లో ఉంటుంది. 


వీయూ ప్రీమియం టీవీ స్పెసిఫికేషన్లు:
# 43 ఇంచ్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ
# 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమోరీ
# ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
# అల్ట్రా హెచ్‌డీ 3840 x 2160  పిక్సల్స్ 
# 30 వాట్ల సౌండ్ అవుట్ పుట్
# రిఫ్రెష్ రేట్ 60 Hz


Also Read: వికెట్ల వెనకాల ఉండి ఏం **తున్నావ్.. దినేశ్‌ కార్తిక్‌పై ఫైర్ అయిన రోహిత్‌ శర్మ (వీడియో)


Also Read: శని మహాదశతో 19 సంవత్సరాలు కష్టాలే.. ఈ పరిహారం చేస్తే పట్టిందల్లా బంగారమే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.