Flipkart Offers on Realme 9 5G SE 128 GB and 6 GB RAM smart phone: దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్‌' భారీ ఆఫర్లకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 23 నుంచి 30 వరకు 'బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌' నిర్వహించనుంది. 8 రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ ట్యాప్‌లు, స్మార్ట్‌ వాచ్‌లు, యాక్సెసరీస్‌పై భారీగా డిస్కౌంట్లు ఉండనున్నాయి. అయితే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ ఆరంభం కాకముందే రియల్‌మీ 9 5జీ ఎస్ఈ (Realme 9 5G SE)పై ఫ్లిప్‌కార్ట్‌ ఓ భారీ ఆఫర్ ఉంచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 'రియల్‌మీ 9 5జీ ఎస్ఈ' (Starry Glow, 128 GB, 6 GB RAM) స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 24,999లుగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో 20 శాతం ఆఫర్ ఉంది. దాంతో రూ. 5000 తగ్గింపుతో రియల్‌మీ 9 5జీ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 19,999 ధరకే మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకున్నవారికి ఫ్లిప్‌కార్ట్‌ ఆక్సిస్ బ్యాంకు కార్డ్‌ ఆఫర్ ఉంది. ఇందులో 5 శాతం ఆఫర్ ఉంది. 


రియల్‌మీ 9 5జీ ఎస్ఈని కేవలం రూ. 2, 999కే ఇంటికి తీసుకుపోవచ్చు. అదెలాగంటే.. ఎక్స్ ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకు మీరు సొంతం చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్ ఛేంజ్ ఆఫర్‌ కింద రూ. 17,000 వరకు వస్తుంది. అయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే, పనితీరు, బ్యాటరీ బాగుండాలి. అంతేకాకుండా ఎలాంటి ఫిజికల్ డామేజ్ కూడా ఉండకూడదు. అన్ని బాగున్న పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ. 17,000 వస్తే.. అప్పుడు రియల్‌మీ 9 5జీ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 2,999కే మీ సొంతమవుతుంది. 


రియల్‌మీ 9 5జీ ఎస్ఈ ఫీచర్లు ఇవే:
# 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లే
# Qualcomm Snapdragon 778G ప్రాసెసర్
# Android 11 ఆపరేటింగ్ సిస్టం
# 48MP + 2MP + 2MP ప్రైమరీ కెమెరా
# 16MP ఫ్రంట్ కెమెరా
# 5,000mAh బ్యాటరీ
# మైక్రో USB పోర్ట్ 
#  డ్యూయల్ సిమ్


Also Read: OTT Release: కార్తికేయ 2, బింబిసార ఓటీటీ విడుదలపై స్పందించిన జీ5!


Also Read: అసిస్టెంట్ డైరెక్టర్ కాబోయి స్టార్ యాక్టర్.. వెన్నెల కిషోర్ కి రోజుకు 5 లక్షలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.