Flipkart Sale: స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఫ్లిప్‌కార్ట్ సేల్ రేపే ఆఖరు, అదనపు డిస్కౌంట్లు
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఆఫర్ సేల్స్ ఇవాళ ప్రత్యేకంగా నడుస్తోంది. దీవాళి సేల్ పురస్కరించుకుని స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఆ డిస్కౌంట్ వివరాలు చెక్ చేద్దాం..
ఫ్లిప్‌కార్ట్ దీవాళి సేల్ 2022 రేపటితో ముగిసిపోతోంది. మరొక్క రోజు మాత్రమే మిగిలింది. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. కొన్ని బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్ కూడా అందనుంది. ఆ ఆఫర్ల వివరాలు ఓసారి పరిశీలిద్దాం..
ఫ్లిప్‌కార్ట్ దీవాళి సేల్ 2022 ముగుస్తోంది. రేపు అక్టోబర్ 16 ఆఖరి తేదీ. అక్టోబర్ 11 న ప్రారంభమైన ఈ సేల్ ద్వారా స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్‌కు మరో రోజు మాత్రమే మిగిలుండటంతో ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు మరోసారి పెంచింది. ఈసారి కొన్ని బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్ తోడవుతోంది. శాంసంగ్, ఐఫోన్, గూగుల్ పిక్సెల్, మోటోరోలా వంటి ఫోన్లపై కూడా ఆఫర్ ఉంది. ఇక కొటాక్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులపై అదనంగా 1250 రూపాయల వరకూ డిస్కౌంట్ అందుతుంది.
నోథిన్ ఫోన్ 1 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో 29,999 రూపాయలకు లిస్ట్ కాగా ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న అదనపు డిస్కౌంట్లతో ఈ స్మార్ట్‌ఫోన్ 26,749 రూపాయలకు లభించనుంది.
యాపిల్ ఐఫోన్ 13 129 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 59,990 రూపాయలకు లిస్ట్ అయింది. ఫ్లిప్‌కార్డ్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ద్వారా అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ అందనుంది. ఎస్బీఐ, కొటాక్ బ్యాంక్ కార్డులపై ఇప్పటికే ఉన్న డిస్కౌంట్ కొనసాగుతుంది.
ఇక మోటో జి72 స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 18,999 రూపాయలకు ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. ఇప్పుడు అదనపు డిస్కౌంట్ల అనంతరం 14,749 రూపాయలకు లభ్యం కానుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 35, 999 రూపాయలకు లిస్ట్ కాగా అదనపు డిస్కౌంట్ల ఆఫర్ల అనంతరం 32, 999 రూపాయలకు లభ్యం కానుంది.
గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 34,199 రూపాయలకు లిస్ట్ కాగా ఎస్బీఐ, కొటాక్ బ్యాంక్ కార్డులు అందిస్తున్న అదనపు డిస్కౌంట్ అనంతరం 27,999 రూపాయలకు లభ్యం కానుంది.
Also read: Jobs in Indian Army: ఇండియన్ ఆర్మీ నుంచి జాబ్ నోటిఫికేషన్.. వీరు కూడా అప్లై చేసుకోవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook