Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు , సగం ధరకే మీ కోసం
Flipkart Offers: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఫోన్లు భారీ తగ్గింపు ధరకు లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్లతో అందుబాటులో రానున్నాయి. తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ఫీచర్లు కలిగిన శాంసంగ్ ఫోన్లు ఇవి. ఏకంగా 50 శాతం డిస్కౌంట్ లభించనుంది.
Samsung Galaxy A14 5G స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా 45 శాతం డిస్కౌంట్ లభించనుంది. 18,499 స్మార్ట్‌ఫోన్ కేవలం 9,999 రూపాయలకే పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ 6.6 ఇంచెస్ డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇందులోనే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ అయితే 42 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 20,999 రూపాయలు కాగా 11,999 రూపాయలకు లభించనుంది.
Samsung Galaxy M35 5G ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో 37 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఈ ఫోన్ అసలు ధర 24,499 రూపాయలు కాగా కేవలం 15,249 రూపాయలకే పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 5 శాతం డిస్కొంట్ లభిస్తుంది. ఈ ఫోన్ 6.6 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఉంటుంది.
Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో 14 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంటాయి. ఈ ఫోన్ అసలు ధర 16,999 రూపాయలు కాగా డిస్కౌంట్ అనంతరం 14, 499 రూపాయలకు పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డుతో అయితే 1000 రూపాయలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
Samsung Galaxy S23 5G స్మార్ట్‌ఫోన్ 6.1 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉండి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరాతో వస్తోంది. ఇందులో సెల్ఫీ కెమేరా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.