COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Drop Motorola G62 5G, Motorola G34 5G Price: మోటోరోలా వెబ్‌సైట్‌లో ఇటీవలే లాంచ్‌ అయిన స్మార్ట్ ఫోన్స్‌పై భారీ ఆఫర్స్‌ను ప్రకటించింది. ముఖ్యంగా  G సిరీస్ మొబైల్స్‌ను భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. ఇటీవలే Motorola G62 5G, Motorola G34 5G మోడల్స్‌తో విడుదలైన స్మార్ట్‌ ఫోన్స్‌ బంఫర్‌ తగ్గింపుతో లభిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు మొబైల్స్‌ కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.10,999కే అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు వీటిని కొనుగోలు చేసే క్రమంలో కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్‌ కూడా పొందుతారు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన డిస్కౌంట్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
  
Motorola G62 (6 GB + 128 GB):
ప్రస్తుతం మోటోరోలా వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 10,999 కాగా ప్రత్యేక డీల్స్‌లో భాగంగా రూ.1,500 తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో MobiKwik వాలెట్ ద్వారా బిల్ చెల్లిస్తే దాదాపు రూ. 5,000 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. ఇక ఫీచర్స్‌ విషయానికొస్తే ఈ మొబైల్‌  6.5 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ డిప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌, 8 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. 


ఇక ప్రాసెసర్‌ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌పై రన్‌ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన త్రిపుల్‌ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. ఇందులో 50 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా సెన్సార్‌తో పాటు, 8MP డెప్త్, 2MP మాక్రో కెమెరాలతో లభిస్తోంది. అంతేకాకుండా సెల్ఫీ కోసం ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా పొందవచ్చు. ఈ మొబైల్‌ 5000mAh బ్యాటరీ, 20 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్‌తో లభిస్తోంది.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


Motorola G34 5G:
Motorola అధికారిక వెబ్‌సైట్‌లో ఈ Motorola G34 5G స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 10,999తో అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేక డీల్‌లో భాగంగా ఈ ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్‌లతో పొందవచ్చు. ఈ మొబైల్‌పై కంపెనీ అదనంగా ప్లాట్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. ఈ మొబైల్‌ Snapdragon 695 5G చిప్‌సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter