COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Get Poco M6 Huge Discount: అతి తక్కువ ధరలోని ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ పోకో విడుదల చేసిన మొబైల్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా ఇది సరైన సమయం గా భావించవచ్చు ఫ్లిఫ్‌కార్ట్‌లోని ఉగాది ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా అన్ని రకాల మొబైల్ పై ప్రత్యేకమైన డీల్స్ కొనసాగుతున్నాయి. ఈ డీల్స్‌లో భాగంగా ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన కొత్త కొత్త మొబైల్ పై దాదాపు 20 శాతంకు పైగా డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ప్రీమియం మొబైల్స్‌కి ప్రత్యేకమైన ఫ్లాట్ తగ్గింపుతో పాటు, ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా Poco విడుదల చేసిన కొన్ని మొబైల్స్ మొబైల్స్ డెడ్ చీప్ ధరల్లోనే లభిస్తున్నాయి. పోకో లాంచ్ చేసిన ఎం6 (POCO M6 5G) మొబైల్ 30 నుంచి 32 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ పై అదనంగా ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఉగాది సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ స్మార్ట్ ఫోన్ పై అందిస్తున్న ప్రత్యేకమైన ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


పోకో లాంచ్ చేసిన ఎం6 (POCO M6 5G) మొబైల్ మొత్తం మూడు కలర్ ఆప్షన్స్‌తో పాటు రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ మార్కెట్లో ఎక్కువగా సేల్ అయింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిఫ్‌కార్ట్‌లో MRP ధర రూ.12,999తో లభిస్తోంది. అయితే ఉగాది (Ugadi 2024) సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేకమైన డీల్లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ పై 32 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను ఇది కేవలం రూ.8,799కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు ఫ్లిప్కార్ట్ ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది.


ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, పోకో ఎం 6 (POCO M6 5G) మొబైల్‌ను యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.400 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు ఫ్లిఫ్‌కార్ట్‌ యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా ఈ మొబైల్ కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌ను కాంబో ఆప్షన్ ద్వారా కొనుగోలు చేయాలనుకునే వారికి మరింత డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆప్షన్ లో భాగంగా మొబైల్‌తో పాటు ఫ్లిఫ్‌కార్ట్‌ సూచించే మొబైల్ బ్యాక్ పౌచ్‌ను కొనుగోలు చేస్తే రూ.9 వేల లోనే రెండింటినీ పొందవచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.


పోకో ఎం 6 స్మార్ట్‌ఫోన్‌ టాప్‌ ఫీచర్స్‌:
డిస్‌ప్లే:
6.58" FHD+ డోట్‌ డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్
240Hz టచ్ శాంపిల్ రేట్
Corning Gorilla Glass 3


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


పెర్ఫార్మెన్స్:
MediaTek Helio G96 ప్రాసెసర్
8GB RAM
128GB స్టోరేజ్
LPDDR4x RAM
UFS 2.2 స్టోరేజ్


కెమెరా:
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్:
50MP ప్రధాన కెమెరా
8MP అల్ట్రా-వైడ్ కెమెరా
2MP మాక్రో కెమెరా
8MP సెల్ఫీ కెమెరా


బ్యాటరీ:
5000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ చార్జింగ్
22.5W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి