Get SAMSUNG Galaxy F54 5G Half Price: ప్రస్తుతం మార్కెట్‌లో సాంసంగ్‌కి సంబంధించిన F సిరీస్‌ స్మార్ట్ ఫోన్‌లకు మంచి డిమాండ్‌ ఉంది. అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్‌ కలిగి ఉండడంతో యువత ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్‌లోని రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా కొన్ని సాంసంగ్‌కి సంబంధించిన స్మార్ట్‌ ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన SAMSUNG Galaxy F54 5G మొబైల్‌ డెడ్‌ చీప్‌గా లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన డిస్కౌంట్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఈ SAMSUNG Galaxy F54 5G స్మార్ట్‌ ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్‌ అసలు ధర MRP రూ.35,999 కాగా..ప్రత్యేక సేల్‌లో భాగంగా 30 శాతం తగ్గింపుతో కేవలం ఈ Galaxy F54 5G మొబైల్‌ రూ.24,999కే లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా వినియోగించాల్సి ఉంటుంది.


ఈ SAMSUNG Galaxy F54 5G మొబైల్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా Samsung Axis బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్‌ని వినియోగించి బిల్‌ చెల్లిస్తే 10% వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీకు రూ.2,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా యాస్‌ బ్యాంక్‌, వన్‌కార్ట్‌ క్రెడిట్‌ కార్డ్‌లను ఉపయోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు IDFC క్రెడిట్‌కార్డ్, యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో పాటు ఇతర క్రెడిట్‌ కార్డ్‌లపై కూడా ప్రత్యేక తగ్గింపు పొందవచ్చు. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


ఎక్స్ఛేంజ్ బోనస్‌:
ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ను భోనస్‌లను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌లో భాగంగా మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు ఈ ఫోన్‌పై రూ. 24,160 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.839కే లభిస్తోంది. అయితే ఈ ఎక్చేంజ్‌ భోనస్‌ అనేది స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది.


SAMSUNG Galaxy F54 5G మొబైల్‌ ఫీచర్స్‌, స్పెఫికేషన్స్‌:
✾ 8 జీబీ ర్యామ్
✾ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
✾ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా
✾ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
✾ 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
✾ 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్
✾ మైక్రో SD కార్డ్‌ సపోర్ట్‌
✾ Exynos 1380 ప్రాసెసర్‌
✾ 6000mAh బ్యాటరీ
✾ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
✾ Android 13 ఆధారంగా OneUI 5.1
USB టైప్-సి పోర్ట్


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter