Thomson 55 inch QLED 4K: పండగ ఫీచర్ సీజన్.. చాలా కంపెనీలు తమ నుండి మంచి మంచి టీవీలను విడుదల చేస్తున్నాయి. పండుగ సీజన్ ను టార్గెట్ చేస్తూ.. వినియోగదారులను ఆకర్షించేందుకు అన్ని టీవీ కంపెనీలు సరికొత్త ఫీచర్లుతో తక్కువ ధరకే అందిస్తున్నాయి. దీపావళికి ముందుగాను థాంప్సన్ 55 అంగుళాల QLED 4K Google TV (55opmaxgt9030) ని విడుదల చేసింది.  ఈ టీవీ ఉన్న గది పూర్తిగా సినిమా హాల్ లాగా మారుస్తుంది. ఈ టీవీ సైజ్ లోనే కాదు సౌండ్ లోను అద్భుతంగా ఉంది. ఈ టీవీ పిక్చర్ క్వాలిటీ బాగున్నా నేపథ్యంలో ఈ టీవీ  చాలానే చర్చలు జరుగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిజైన్ ఎలా ఉందంటే..?
థామ్సన్ 55 అంగుళాల QLED 4K Google TV చాలా స్టైలిష్‌గా కనపడుతుంది. ఈ టీవీ చాలా సన్నగా ఉండి.. పిక్చర్  కూడా అద్భుతంగా ఉంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ టీవీలో 3 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. ఇది కాకుండా, AV అవుట్‌పుట్, యాంటెన్నా స్లాట్ మరియు బ్లూటూత్ 5.0 కూడా ఉంది. టీవీ బెజెల్ తక్కువ డిజైన్‌తో రావటం కారణంగా ప్రీమియం రూపాన్ని వస్తుంది. డిజైన్ పరంగా ఇది గొప్ప అనుభూతిని ఇస్తుంది.


డిస్‌ప్లే ఎలా ఉందంటే..? 
ఈ టీవీ డిస్‌ప్లేతో 4K అమర్చబడిన కారణంగా అధిక-రిజల్యూషన్ చిత్రాలను అందిస్తుంది. ఇది QLED డిస్‌ప్లే ను కలిగి ఉన్న కారణంగా ప్రకాశవంతమైన, శక్తివంతమైన రంగులను ప్రదర్శిస్తుంది. ఇది 550 నిట్‌ల ప్రకాశాన్ని అందిస్తుంది, ఇది పగటిపూట కూడా స్పష్టమైన చిత్రాలను అందిస్తుంది. దీని రేషియో 16:09ఉండటం కారణంగా సినిమాటిక్ అనుభూతిని ఇస్తుంది. IPS డిస్‌ప్లే 178 డిగ్రీల వరకు ఉండటంతో.. అన్ని యాంగిల్స్ లో స్పష్టమైన చిత్రాలను అందిస్తుంది. 


Also Read: Cricket in Olympics: వందేళ్ల తరువాత 2028లో తిరిగి ఒలింపిక్స్‌లో క్రికెట్


థామ్సన్ 55 అంగుళాల QLED 4K Google TV సౌండ్.. 
మెరుగైన సౌండ్ కోసం ఈ టీవీలో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ మరియు డాల్బీ డిజిటల్ ప్లస్ వంటి ఫీచర్లు అమర్చబడ్డాయి. వీటి కారణంగా సినిమా మరియు గేమ్ లు ఆడెపుడు ఆడియో అనుభవాన్ని పొందవచ్చు. అంతేకాకుండా, ఈ టీవీ 2GB RAM మరియు 16GB స్టోరేజ్ లంబు కలిగి ఉన్నందున మంచి పనితీరును అందిస్తుంది. టీవీలో ఉండే 4 స్పీకర్లు 40 W సౌండ్‌ని అందిస్తాయి. ఈ స్పీకర్స్ వల్ల వచ్చే సౌండ్.. గట్టిగా స్పష్టంగా ఉంటుంది. ఈ ఫీచర్ తో మీరు అదనపు సౌండ్ బార్ లేదా సిస్టంను జోడించాల్సిన అవసరం లేదు. 


వీటితో పాటుగా.. వాయిస్ కంట్రోల్ రిమోట్ లో ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్, గూగుల్ ప్లే వంటి వాటి కోసం రిమోట్ లోనే విడిగా బటన్స్ కూడా ఉన్నాయి. దీని ధర రూ.32,999 కాగా ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.28,499కి అందుబాటులో ఉంది. మనం అన్నింటిని పరిశీలిస్తే.. ఈ స్మార్ట్ టీవీ ధరకు మించిన ఫీచర్స్ ను కలిగి ఉంది .  


Also Read: Ap Government: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఫెయిల్ అయినా మళ్లీ పదో తరగతిలో చేరవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..