Itel P55 5G Price: ప్రస్తుతం మార్కెట్‌లోకి కొత్త రకం స్మార్ట్‌ ఫోన్‌లు అందుబాలులోకి వచ్చాయి. వివిధ రకాల కలర్స్‌లో అదిరిపోయే ఫీచర్‌లతో ఫోన్‌ లవర్స్‌ను మైమరుస్తుంది. అయితే ప్రస్తుతం యువత 5G ఫోన్‌ను కొనుగోల చేయడంపై ఆసక్తి చూపుతున్నారు. కానీ  5G ధరలు ఎక్కువగా ఉండటం వల్ల వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా అతి తక్కువ ధరలోనే ఈ ఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు. కేవలం 10 వేల కంటే తక్కువ ధరలో 5G ఫోన్‌ను కొనుగోలు చేయడానికి Amazon ఒక బిగ్‌ డీల్‌ తీసుకువచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూ. 10,000 కంటే తక్కువ ధరతో 5G ఫోన్‌..


బడ్జెట్‌ ఫ్రెండ్లీలో ఫోన్‌ను కొనుగోలు చేయాలి ఆలోచిస్తున్నవారు తప్పకుండా Amazon బిగ్‌ డీల్‌ను ట్రై చేయాల్సిందే.  ఈ డీల్‌లో ఎక్కువ ధరల్లో ఉన్న 5G మొబైల్స్‌ డెడ్‌ చీప్‌ ధరల్లో సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ టెక్‌ కంపెనీ ఐటెల్ ఇటీవలే విడుదల చేసిన 5G ఫోన్ ఐటెల్ P55 5G అమెజాన్ డీల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్‌లో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ను సంగం ధరకే పొందే విధంగా అమెజాన్‌ ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది.


అయితే ఈ మొబైల్‌ అసలు ధర Mrp రూ. 13,299 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా ఈ మొబైల్‌ ఫోన్‌  కేవలం రూ. 8,999లో లభిస్తోంది. దీంతో పాటు మీరు ఈ మొబైల్‌ను మరింత అదనపు తగ్గింపుతో పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 9,450 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కేవలం రూ.549కే పొందవచ్చు.


Also read: Kia Sonet Pre Booking: కియా సోనెట్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. కొత్త కారులో అదిరిపోయే ఫీచర్లు


ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు:


ఈ  ఐటెల్ P55 స్మార్ట్ ఫోన్‌  720X1612 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల Hd+ Ips Lcdను కలిగి ఉంటుంది. దీని డిస్ల్పే 90Hz రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ 180Hz సపోర్ట్‌తో లభిస్తోంది. ఇక ప్రాసెసర్‌ విషయానికొస్తే..ఈ మొబైల్‌  Mali G57 Gpuతో Mediatek Dimension 6080 ప్రాసెసర్‌పై నడుస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్‌  6 Gb Ram, 128 Gb ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తోంది. గరిష్టంగా 6 Gb వర్చువల్ Ramను మొత్తం Ram 12 Gb వరకు పెంచుకోవచ్చు. 


ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన కెమెరా విషయానికొస్తే..బ్యాక్‌ సెట్‌లో డబుల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌ ప్రధాన కెమెరాతో పాటు సెల్ఫీ కోసం 8-మెగాపిక్సెల్ కెమెరా కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో కంపెనీ 5000Mah బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను అందిస్తోంది. దీంతో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ Android 13 Osలో పని చేస్తుంది. కనెక్టివిటీ కోసం కంపెనీ..డ్యూయల్ సిమ్ సెటప్‌, Wi-fi 802.11Ac, బ్లూటూత్‌లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ మింట్ గ్రీన్, గెలాక్సీ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.


Also read: Evolutyz: మరో రెండేళ్లలో రూ.650 కోట్ల ఆదాయమే లక్ష్యంగా ఎవల్యూటిజ్ కంపెనీ అడుగులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook