WhatsApp లో కొత్త ఫీచర్.. త్వరలో రానున్న వాయిస్ డిసప్పియర్ మెసేజ్
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది కమ్యూనికేషన్ చేసే ఆప్ వాట్సాప్.. కొత్త కొత్త ఫీచర్లను తెస్తూ.. యూసర్లను ఆకట్టుకుంటుంది. ఫోటోలకు వీడియోలకు వినియోగించే వన్స్ డిసప్పీయర్ ఫీచర్.. వాయిస్ మెసేజ్ లకు కూడా రానుంది. ఆ వివరాలు
Voice Messages Disappear Feature in Whats App: వాట్సాప్.. మన దేశంలో ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్ లో ఉండే ఆప్ వాట్సాప్. వాట్సాప్ ఆప్ కూడా వినియోగదారు అనుభవాన్ని ఎప్పటికపుడు మెరుగుపరచడానికి కొత్త ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంటుంది. వాట్సాప్ ఆప్ కంపెనీ 2021లో 'వ్యూ వన్స్' ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ తో ఒకేసారి చూసిన తరువాత ఫోటోలు మరియు వీడియోలు అదృశ్యమవుతాయి. అదే సమయంలో, ఆప్ డిసప్పీయర్ మెసేజ్ లేదా స్వతహాగా కిల్ చేసుకునే ఫీచర్ కూడా పరిచయం చేసిన సంగతి మనకు తెలిసిందే! ఇపుడు అలాంటి ఫీచర్ నే వాయిస్ మెసేజ్‌లకు కూడా తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్‌లలో బీటా టెస్టర్‌ల కోసం వాట్సాప్ డిసప్పీయరింగ్ వాయిస్ మెసేజ్ ఫీచర్‌ను విడుదల చేయడం ప్రారంభించింది.
వాట్సాప్ వాయిస్ మెసేజ్ డిసప్పియర్..
ఈ కొత్త ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్‌లను ఒకసారి చూసేందుకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం ఫోటోలు, వీడియోలను ఎలా అయితే ఒకసారి మాత్రమే చూడవచ్చో.. అలాగే ఒక్కసారి మాత్రమే వాయిస్ మెసేజ్‌లను చూడవచ్చు. మీరు ఎవరికైన వాయిస్ మెసేజ్ పంపిస్తే.. పొందిన వారు ఒకసారి మాత్రమే వినవచ్చు. ఆ తరువాత అది ఆటోమేటిక్ గా మాయమైపోతుంది. వాయిస్ మెసేజ్ పొందినవారు దాన్ని సేవ్ చేసుకోలేరు. ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ డెవలప్ లోనే ఉంది. కానీ ఇది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది.
ఈ ఫీచర్ డెవలప్ చేసే పనిలో సంస్థ ఉంది, కానీ.. మీరు Google Play Store నుండి Android 2.23.22.4 అప్‌డేట్ కోసం WhatsApp బీటాని డౌన్ లోడ్ చేసుకోవటం ద్వారా లేదా iOS 23.21.1.73 అప్‌డేట్ కోసం WhatsApp బీటాని TestFlight యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొని వాడవచ్చు.
మీరు బీటా టెస్టర్ అయితే ఇలా అనుసరించండి..
మీరు మెసేజ్ పంపాలనుకుంటున్న WhatsApp చాట్‌ను ఓపెన్ చేయండి
మైక్రోఫోన్ బటన్‌ను నొక్కి వాయిస్ సందేశాన్ని రికార్డ్ చేయండి.
రికార్డింగ్ పూర్తైన తర్వాత.. బటన్ పై నొక్కి మెసేజ్ ను పంపండి.
ఇప్పుడు మీ వాయిస్ మెసేజ్ కేవలం ఒకేసారి మాత్రమే సెట్ చేయబడింది. పొందిన మెసేజ్ పొందిన మెసేజ్ ఒకేసారి సారి మాత్రమే మెసేజ్ ను వినగలడు.. మరియు విన్న తరువాత ఆ మెసేజ్ స్వతహాగా మాయం అయిపోతుంది.
త్వరలో అందరికి రానున్న ఫీచర్..
వ్యూ వన్స్ మోడ్ కేవలం బీటా టెస్టర్ లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు బీటా టెస్టర్ ప్రోగ్రాంలో లేకపోతె ఈ ఫీచర్ ను వాడలేరు.. వాట్సాప్ ఆప్ యాజమాన్యం ఈ ఫీచర్ ను త్వరలో అందరికి అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..