Google Pixel 7 Pro Price: భలే ఆఫర్.. G2 చిప్‌సెట్ Google Pixel 7 Pro ఫోన్‌ను డెడ్ ఛీప్‌కే పొందండి!
Google Pixel 7 Pro Price Cut: అతి తక్కువ ధరలోనే ఎప్పటినుంచో Google Pixel 7 Pro స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తుంది.
Google Pixel 7 Pro Price Cut: ప్రీమియం కెమెరాతో కూడిన మొబైల్స్ అంటేనే అందరికీ గుర్తొచ్చేవి గూగుల్ పిక్సెల్ మొబైల్స్.. గూగుల్ కంపెనీ విడుదల చేసే ప్రతి స్మార్ట్ ఫోన్‌ను అతి శక్తివంతమైన కెమెరాతో లాంచ్ చేస్తూ వస్తుంది. అంతేకాకుండా ఈ కెమెరా అద్భుతమైన జూమ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. అలాగే ప్రీమియం లుక్ లో కనిపించే ఈ మొబైల్స్ మిడిల్ రేంజ్ బడ్జెట్‌లోనే అందుబాటులో ఉంటాయి. గూగుల్ పిక్సెల్ సిరీస్ లాంచ్ అయినప్పటి నుంచి చాలామంది యాపిల్ మొబైల్స్ అని కొనుగోలు చేసేవారు వీటికి డైవర్ట్ అవుతున్నారు. అంతేకాకుండా కొన్ని దేశాల్లో ఈ మొబైల్స్ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ లిస్టులో చేరిపోయాయి. గూగుల్ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ని ఎప్పుడు విడుదల చేసిన G చిప్ సెట్ అప్‌తోనే అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే మీరు కూడా ఇలాంటి ప్రీమియం కెమెరా కలిగిన గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు.. ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డీల్స్ లో భాగంగా గూగుల్ పిక్సెల్ మొబైల్స్ అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో Google Pixel 7 Pro స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ మొబైల్ మూడు కలర్స్‌తో పాటు రెండు స్టోరేజ్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర మార్కెట్లో MRP రూ. 84,999 కాగా ఈ మొబైల్‌ని ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన తగ్గింపుతో కేవలం రూ.45,999 లభిస్తుంది. అంటే దాదాపు 45 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్ ను వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపుతో ఈ మొబైల్ ను పొందవచ్చు.
ఈ Google Pixel 7 Pro మొబైల్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లించే వారికి కూడా రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా యూపీఐ వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ. 500 వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే అన్ని బ్యాంకులకు సంబంధించిన డెబిట్ క్రెడిట్ కార్డుల తో EMI ఆప్షన్ చూజ్ చేసుకుని కొనుగోలు చేసే వారికి నో కాస్ట్ ఇఎంఐ కూడా లభిస్తోంది. ఇవే కాకుండా ఈ మొబైల్ పై అదనంగా ఇతర కూపన్స్ కూడా లభిస్తున్నాయి అవేంటో తెలుసుకోవడానికి ఫ్లిప్కార్ట్ యాప్ ని లేదా వెబ్సైట్ని సందర్శించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
అద్భుతమైన కెమెరా సెటప్
50MP ప్రైమరీ కెమెరా
12MP అల్ట్రావైడ్ కెమెరా
48MP టెలిఫోటో కెమెరా
మెరుగైన నైట్ సైట్
సూపర్ రెజోల్యూషన్ జూమ్
మాగ్నిఫైయర్ ఫీచర్
కస్టమ్-బిల్ట్ టెన్సర్ G2 చిప్‌సెట్
6.7-inch QHD+ AMOLED డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేటు
ఆండ్రాయిడ్ 13
ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
ఫాస్ట్, వైర్‌లెస్ చార్జింగ్
వాటర్‌రెసిస్టెంట్ ఫీచర్
Google అసిస్టెంట్ ఫీచర్
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి