Google Pixel Fold: గూగుల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్.. డిజైన్, స్పెసిఫికేషన్ వివరాలు ఇవే!
Google to release foldable smartphone Google Pixel Fold. తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురానున్నట్లు గూగుల్ అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ ఫోల్డ్ పేరిట ఫోల్డబుల్ ఫోన్ రానుంది.
Google to release foldable smartphone Google Pixel Fold: మరో విభాగంలోకి ప్రవేశించడానికి గూగుల్ సిద్ధంగా ఉంది. గూగుల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ వస్తుందని గతకొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆ వార్తలే నిజమయ్యయాయి. తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురానున్నట్లు గూగుల్ అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold) పేరిట ఫోల్డబుల్ ఫోన్ వస్తున్నట్లు గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. మే 10 జరగనున్న 'I/O 2023' ఈవెంట్‌కు ముందు పిక్సెల్ ఫోల్డ్ అధికారిక రూపాన్ని రిలీజ్ చేసింది.
గూగుల్ నుంచి వస్తున్న పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ ఎలా ఉండనుందో చూపిస్తూ ఓ వీడియో టీజర్‌ను గూగుల్ గత రాత్రి సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను 2023 మే 10 నుంచి ప్రారంభం కానున్న వార్షిక సమావేశం ‘I/O 2023’లో వెల్లడించనున్నట్లు గూగుల్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో పిక్సెల్ ఫోల్డ్‌తో పాటు పిక్సెల్ 7ఏ స్మార్ట్‌ఫోన్, పిక్సెల్ ట్యాబ్లెట్‌ను సైతం పరిచయం చేయనుంది.
పిక్సెల్ ఫోల్డ్‌కు సంబంధించిన వీడియో టీజర్ నిడివిని గూగుల్ తక్కువగా కట్ చేసింది. అయినా కూడా ఫోన్‌కు సంబంధించిన చాలా విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఫోన్ డిజైన్, హింజ్ సపోర్ట్, డిస్ప్లై, సాఫ్ట్‌వేర్, కెమెరాలు, ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్ వంటి వివరాలు వీడియోలో కనిపిస్తున్నాయి. పిక్సెల్ ఫోల్డ్‌ను తెలుపు రంగులో చూడవచ్చు. ఫుటేజ్ ఓపెన్ మరియు క్లోజ్డ్ స్టేట్‌లో ఫోల్డబుల్‌ని కూడా చూడొచ్చు. పిక్సెల్ ఫోల్డ్ లోపలి స్క్రీన్ ఎంత సన్నగా ఉందో వీడియో ద్వారా తెలుస్తుంది. అయితే అన్ని స్పెసిఫికేషన్లు తెలియాలంటే మే 10 వరకు ఆగాల్సిందే.
టిప్‌స్టర్ ప్రకారం.. పిక్సెల్ ఫోల్డ్ టెన్సర్ జీ2 ప్రాసెసర్‌తో రాబోతున్నట్లు సమాచారం. ఇదే ప్రాసెసర్ ఇప్పటికే పిక్సెల్ 7, పిక్సెల్ 7ప్రొ స్మార్ట్‌ఫోన్లలో ఉంది. ఈ ఫోన్ ధర రూ. 148000గా ఉంటుందట. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ (48MP ప్రధాన కెమెరా+ 10.8MP అల్ట్రా వైడ్+ 10.8MP టెలిఫోటో) ఉంటుందని అంచనా. సెల్ఫీల కోసం ఔటర్ డిస్‌ప్లేపై 9.5 మెగాపిక్సెల్, ఇన్నర్ డిస్‌ప్లేపై 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చని తెలుస్తోంది. 5.8 అంగుళాల కవర్ డిస్‌ప్లే మరియు 7.69 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లేను పొందే అవకాశం ఉంది. ఈ ఫోన్ Android 13లో రన్ అవుతుంది. 283 గ్రాముల బరువు ఉన్న పిక్సెల్ ఫోల్డ్.. 20W ఛార్జర్‌తో పాటు 4500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
Also Read: Best Dal For Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా?, మైసూర్ పప్పుతో 12 రోజుల్లో కేజీ తగ్గుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.