Google Removes 16 Apps: ఆండ్రాయిడ్ యాప్స్ వినియోగదారులకు అలర్ట్. మీ డేటాను, మీ మొబైల్ ఛార్జింగ్‌ను త్వరగా ఖాళీ చేస్తున్న 16 యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. యాడ్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్న యాప్స్‌ను గుర్తించిన గుగూల్.. ప్లే స్టోర్ నుంచి తొలగించిందని ఓ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ప్రకటనలపై క్లిక్ చేస్తే యూజర్లను రహస్యంగా వెబ్‌సైట్‌లకు మళ్లించడం ద్వారా యాడ్స్ మోసానికి పాల్పడుతున్నాయని పేర్కొంది. దీంతో యూజర్లకు డేటాతో పాటు బ్యాటరీ కూడా త్వరగా అయిపోతుండడంతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తీయడానికి ముందు 20 మిలియన్ల వరకు డౌన్‌లోడ్స్ ఉన్నాయని సెక్యూరిటీ సంస్థ తెలిపింది. మెకేఫే (McAfee) ఈ 16 యాప్స్‌ను గుర్తించగా.. ఆ యాప్స్ అన్నింటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు ఆర్స్ టెక్నికా రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే తొలగించిన యాప్స్ అన్ని కూడా యుటిలిటీ యాప్స్‌గా లిస్ట్ ఉన్నవే. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే యాప్స్, ఫ్లాష్ లైట్స్, మెజర్‌మెంట్ యాప్స్‌ వంటి యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ డిలీట్ చేసింది. 


ఈ యాప్స్ యాక్టివేట్ అయినప్పుడు అవి ఆటోమేటిక్‌గా కోడ్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాయని.. యూజర్‌కు తెలియకుండా వెబ్‌సైట్‌లను బ్రౌజ్ చేయడానికి వచ్చిన వార్నింగ్స్‌ను యాక్సెప్ట్ చేస్తాయని మెకేఫే గుర్తించింది. బ్యాక్ ఎండ్ లింక్‌లు, ప్రకటనలపై క్లిక్ చేస్తారని కనుగొంది. నిజమైన యూజర్‌గా యాక్ట్ చేస్తూ.. యాడ్స్ క్లిక్ చేసి ఫ్రాడ్‌కు పాల్పడుతున్నారు. 


డిలీట్ చేసిన యాప్స్‌లో "com.liveposting", "com.click.cas" వంటి వైబ్‌సైట్స్‌  ఉన్నాయి. వీటి వలన యూజర్‌కు తెలియకుండానే.. లింక్‌లు, యాడ్స్‌పై క్లిక్ చేయగలరు. దీంతో వినియోగదారులు బ్యాటరీతో పాటు డేటా కూడా చాలా అయిపోతుందని కాలిఫోర్నియాలోని ఓ సెక్యూరిటీ సంస్థ రిపోర్ట్ వెల్లడించింది.


గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన 16 యాప్స్ ఇవే..


  • ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ డౌన్‌లోడర్

  • హై-స్పీడ్ కెమెరా

  • క్విక్ నోట్

  • స్మార్ట్ టాస్క్ మేనేజర్

  • కరెన్సీ కన్వర్టర్

  • ఫ్లాష్‌లైట్ +

  • 8K-నిఘంటువు

  • బుసాన్ బస్

  • జాయ్‌కోడ్

  • ఈజెడ్‌డికా

  • ఈజెడ్ నోట్స్

  • మెమోక్యాలెండర్

  • డబుల్ లైన్

  • క్యాల్‌కల్

  • ఇమేజ్‌వాల్ట్ ఫ్లాష్‌లైట్+


 ఈ వీటితో పాటు మరో యాప్‌ను కూడా ప్లే స్టోర్ డిలీట్ చేసింది. ఈ యాప్స్‌ మీ ఫోన్‌్లో ఉంటే డిలీట్ చేసుకుని డేటాను, బ్యాటరీని సేవ్ చేసుకోండి. మీ పేరుతో యాడ్స్‌పై క్లిక్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఇలాంటి ఫ్రాడ్ యాప్స్‌కు దూరంగా ఉండండి. 


Also Read: India vs Netherlands: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ఆ ప్లేయర్ ప్లేస్‌లో రిషబ్ పంత్..! టీమిండియా తుది జట్టు ఇలా..


Also Read: Nara Lokesh: చిరంజీవి, బాలయ్య సినిమాలకు పోటీ.. పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో నారా లోకేష్ కౌంటర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook