SIM Swap : సిమ్ స్వాపింగ్ స్కామ్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోవచ్చు..
SIM Swap Fraud: ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ వణికిస్తున్న సిమ్ స్వాపింగ్ స్కామ్ గురించి మీకు తెలుసా? ఒక స్కామర్ మీ సిమ్ కార్డ్ యాక్సెస్ తీసుకొని మీ నెట్వర్క్ ప్రొవైడర్ ని కూడా మోసం చేసి మీ ఫోన్ నెంబర్ ను వారి వద్ద ఉన్న సిమ్ కార్డ్ కి లింక్ చేస్తారు. దీని వల్ల ఈ మధ్యనే ఒక ఆమె 50 లక్షలు కూడా పోగొట్టుకుంది. అసలు ఇంతకీ ఈ సిమ్ స్వాపింగ్ స్కామ్ ఏంటో తెలుసుకుందాం..
SIM Card Scam : ప్రస్తుతం సిమ్ స్వాపింగ్ స్కామ్ అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. ఈ మధ్యనే ఢిల్లీ కి చెందిన ఒక ప్రముఖ న్యాయవాది స్కామర్ కారణంగా ఏకంగా 50 లక్షల రూపాయలు పోగొట్టుకున్నానని కేసు వాదించారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ షాక్ కి గురిచేస్తుంది.
వివరాల్లోకి వెళితే, ఆ మహిళకు ముందుగా తెలియని నంబర్ నుంచి మూడు మిస్డ్ కాల్స్ వచ్చాయి. దీంతో ఆమె ఆ నంబర్ కి తిరిగి కాల్ చేసింది. ఆ కాల్ లిఫ్ట్ చేసిన ఒక అజ్ఞాత వ్యక్తి అది ఒక కొరియర్ కాల్ అని చెప్పడంతో ఆ మహిళ తన ఇంటి చిరునామాను అతనికి ఇచ్చింది. ఇది జరిగిన కాసేపటికి ఆమె బ్యాంకు నుంచి రెండు లావాదేవీలు జరిగినట్లు నోటిఫికేషన్ లు వచ్చాయి.
దీంతో వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన ఆమె ఆ సదరు వ్యక్తితో ఎటువంటి ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) కానీ మరే బ్యాంకు కి సంబంధించిన సమాచారాన్ని కానీ పంచుకోలేదని స్పష్టం చేసింది. మరి ఆమె బ్యాంక్ నుంచి డబ్బులు ఎలా పోయాయి అంటే సిమ్ స్వాపింగ్ స్కామ్ తో అని చెబుతున్నారు.
అసలు ఈ సిమ్ స్వాపింగ్ స్కామ్ అంటే ఒక స్కామర్ మన సిమ్ కార్డ్ యొక్క ఆక్సిస్ ను పొంది మన నెట్వర్క్ ప్రొవైడర్ ని సైతం మోసగించి మనకి రావాల్సిన ఓటీపీ లు వారికి వచ్చేలాగా చేస్తారు. దీంతో బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీలు వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి వారికి వారు గానే మన బ్యాంకు లావాదేవీలు చేసే అవకాశం లభిస్తుంది.
దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అనుమానస్పదంగా అనిపించే వ్యక్తితో ఎప్పుడూ మాటలు కొనసాగించకూడదు. మీ సిమ్ కార్డు లాక్ చేయబడి ఉంది లేదా అది చెల్లదు అని ఎర్రర్ మెసేజ్లు ఏమైనా మన ఫోన్ కి వస్తే వెంటనే సర్వీస్ ప్రొవైడర్ కి కాల్ చేసి నంబర్ ని బ్లాక్ చేయించాల్సి ఉంటుంది. బ్యాంక్ సంబంధిత వివరాలు సురక్షితంగా ఉంచుకోవచ్చు.
క్రమం తప్పకుండా పాస్వర్డ్ లను మారుస్తూ ఉంచాలి. మన బ్యాంక్ ఖాతా వివరాలు అంత తొందరగా ఎవరికి ఇవ్వకూడదు. మనం చేయకుండా మన బ్యాంక్ నుంచి ఏదైనా లావాదేవీ లు జరిగినట్టు మెసేజ్ వస్తే వెంటనే బ్యాంకు ని సంప్రదించాలి.
Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook