HMD Barbie Flip 2024: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ నోకియా పేరు మార్చినప్పటి నుంచి మార్కెట్‌లో దూసుకుపోతోంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్‌ను అతి తక్కువ ధరలకే లాంచ్‌ చేయడమే కాకుండా కొత్త డిజైన్స్‌లో విడుదల చేస్తూ వస్తోంది. HMD గ్లోబల్ మాట్టెల్ భాగస్వామ్యంతో కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది. దీనిని కంపెనీ HMD బార్బీ పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఫ్లిప్‌ మోడల్‌లో అందుబాటులోకి వచ్చింది. దీనిని హెచ్‌ఎమ్‌డీ కేవలం కాలింగ్‌, మెసేజ్‌లను కలిగి ఉంటుంది. ఈ బార్బీ మోడల్‌లో ఎలాంటి ఇంటర్నెట్, యాప్స్‌లను కలిగి ఉండదు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ HMD బార్బీ మొబైల్‌ అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది పింక్ కలర్‌తో పాటు గ్లాస్‌ కోటింగ్‌ స్క్రీన్‌ను కలిగి ఉంటుంద. అలాగే ఇది రెండు బ్యాక్‌ కవర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీని డిజైన్‌ వివరాల్లోకి వెళితే.. ఇది ప్రత్యేకమైన స్టిక్కర్స్‌తో పాటు పువ్వుల డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీని బాడీ ప్లస్టిక్‌ మెటల్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 
 
ధర వివరాలు:
ఈ HMD బార్బీ ఫ్లిప్ మొబైల్‌ యూకేలో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.11,008 నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా యూరప్‌లో కూడా ఈ మొబైల్ లభిస్తోంది. దీనిని కంపెనీ దాదాపు రూ. 12,085తో విక్రయిస్తోంది. అయితే కొన్ని చోట్ల ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు ఆగస్టు 28 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అధికారిక HMD సైట్‌లో ఈ ఇది రూ.10,825తో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌ కంపెనీ ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. 


HMD బార్బీ స్పెసిఫికేషన్స్‌:
2.8 అంగుళాల మెయిన్ స్క్రీన్
1.77 అంగుళాల కవర్ స్క్రీన్‌
 Unisoc T107 ప్రాసెసర్
 64 MB ర్యామ్‌, 128 MB స్టోరేజ్‌  
డ్యూయల్ సిమ్ సపోర్ట్‌
3.5 mm హెడ్‌ఫోన్ జాక్
MP3 ప్లేయర్
FM రేడియో (వైర్డ్/వైర్‌లెస్)
LED ఫ్లాష్‌తో కూడిన VGA వెనుక కెమెరా
1450mAh బ్యాటరీ
గరిష్టంగా 9 గంటల టాక్ టైమ్‌


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.