Honor 200 Series: 50MP సెల్ఫీ, మెయిన్ కెమేరాతో హానర్ 200 సిరీస్ ఫోన్లు లాంచ్ ఎప్పుడు, ధర ఎంత
Honor 200 Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది. ఇప్పటికే చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఇలా ఉన్నాయి.
Honor 200 Series: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హానర్ ఫోన్లకు ఓ ప్రత్యేకత ఉంది. అద్బుతమైన కెమేరా, ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన హానర్ 200 సిరీస్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది. కెమేరాపరంగా కూడా చాలా అప్‌గ్రేడెడ్ ఫీచర్లు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
హానర్ సంస్థ నుంచి కొత్తగా Honor 200, Honor 200 Pro స్మార్ట్‌ఫోన్లు చైనాలో ఇప్పటికే ఎఁట్రీ ఇచ్చాయి. త్వరలో ఇండియాలో కూడా లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్ 6.7 అంగుళాల కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో 4000 నిట్స్ బ్రైట్‌నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటం వల్ల అద్భుతమైన క్వాలిటీ, రిజల్యూషన్ ఉంటుంది. ఆన్ స్క్రీన్ మంచి అనుభూతిని అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న హానర్ 90, హానర్ ఎక్స్ 9బి కంటే అధునాతనమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 100 వాట్స్ వైర్డ్, 66 వాట్స్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది.
కెమేరా విషయంలో చాలా అప్‌గ్రేడెడ్ ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా f/2.1z ఎపర్చర్ కలిగిన 50MP Sony IMX906 సెల్ఫీ కెమేరా కావడంతో అద్భుతమైన సెల్ఫీలు, వీడియా కాలింగ్ ఉంటుంది. ఇక 50 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ OV50H కెమేరా సెన్సార్‌తో H9000 కలిగి ఉంటుంది. అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మెయిన్ కెమేరా F/1.9ఎపర్చర్‌తో ఉంటుంది. వీటికితోడు 20 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా యూనిట్ కూడా ఉన్నాయి.
హానర్ 200, హానర్ 200 ప్రోలకు కెమేరాపరంగా కొద్దిగా తేడా ఉంటుంది మిగిలిన ఫీచర్లు దాదాపుగా ఒకటే. ఇక ధర విషయానికొస్తే హానర్ 200 అయితే 31 వేలు ఉండవచ్చు. అదే హానర్ 200 ప్రో అయితే 40 వేలుండవచ్చు. హానర్ సిరీస్ ప్రపంచ మార్కెట్‌లో జూన్ 12న ఎంట్రీ ఇవ్వనుంది. ఇదే నెలలో ఇండియాలో లాంచ్ కావచ్చని అంచనా ఉంది.
Also read: Ap High Court: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి ఊరట, జూన్ 5 వరకూ నో అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook