Honor 200 Lite launch: పవర్ఫుల్ 108MP కెమేరా AI ఫీచర్లతో అదిరిపోయే ఫోన్ రేపే లాంచ్
Honor 200 Lite launch: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ మరో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమౌతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వేర్వేరు మోడల్స్ లాంచ్ చేస్తే హానర్ ఇప్పుడు మార్కెట్ షేక్ చేసే ఫోన్‌తో రానుంది. Honor 200 Lite త్వరలో మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Honor 200 Lite launch: మార్కెట్‌లోని అన్ని ఫోన్ల కంటే అత్యధిక కెమేరా రిజల్యూషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో అనుకూలమైన ధరకు స్మార్ట్‌ఫోన్ లభిస్తే అది కచ్చితంగా కిక్కిచ్చే వార్త అవుతుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ నుంచి ఇప్పుడు అలాంటి ఫోన్ లాంచ్‌కు సిద్ధంగా ఉంది. Honor 200 Lite లాంచ్ ఎప్పుడు, ఫీచర్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
Honor 200 Lite రేపు ఇండియాలో లాంచ్ కానుంది. ఇప్పటికే అమెజాన్ సహా వివిధ ఈ కామర్స్ వేదికల్లో వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రేపు ఎంట్రీ ఇవ్వనుంది. Honor 200 Lite 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 2000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 3240 హెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ సపోర్ట్ చేసే ఐ ప్రొటెక్షన్ స్క్రీన్‌తో వస్తోంది. సెక్యూరిటీ కోసం సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ మ్యాజిక్ ఓఎస్ 8.0 ఆధారంగా పనిచేస్తుంది. 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, సియాన్ లేక్, స్టారీ బ్లూ రంగుల్లో లభ్యం కానుంది.
Honor 200 Lite కెమేరా విషయానికొస్తే..ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇది కాకుండా 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమేరాలతో 3 కెమేరా సెటప్ ఉంటుంది. ఇక సెల్ఫీ లేదా వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. ఈ పోన్ ర్యామ్, స్టోరేజ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Honor 200 Lite రేపు అంటే సెప్టెంబర్ 19న భారతీయ మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర 34,998 రూపాయలు ఉంటుందని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.