India First Air Train: దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్..దీని ప్రత్యేకతలు తెలుస్తే అవాక్కవ్వాల్సిందే
Air Train : దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్ సర్వీస్ త్వరలోనే పరుగులు పెట్టనుంది. డ్రైవర్ లేకుండానే పట్టాలనే పరుగులు తీయడం ఈ రైలు ప్రత్యేకత. అంతేకాదు ఈ ఎయిర్ ట్రైన్ లో ప్రయాణికులకు ఫ్రీ జర్నీ ఉంటుంది. ఈ ట్రైన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
What is Delhi Air Train: దేశంలోని తొలి ఎయిర్ ట్రైన్ సర్వీస్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్ డ్రైవర్ లేకుండానే పట్టాలపై పరుగులు పెడుతుంది. అంతేకాదు ఈ ట్రైన్ లో ప్రయాణికులు ఫ్రీగా జర్నీ చేయవచ్చు. ఈ ఎయిర్ ట్రైన్ పట్టాలపై ఎక్కితే ప్రయాణికులకు జర్నీ మరింత సులభం అవుతుంది. టెర్మినల్స్ 1, 3 మధ్య ప్రయాణీకుల కదలికను సులభతరం చేయడానికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ 2027 చివరి నాటికి ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ (APM)ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్ట్ 4 స్టాప్‌లతో 7.7 కి.మీల మార్గాన్ని కవర్ చేస్తుంది. అంతేకాదు బస్సులపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. 2024 చివరిలో బిడ్డింగ్ తర్వాత నిర్మాణం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మనదేశంలో అత్యంత రద్దీ అయిన ఎయిర్ పోర్టు. ఈ ఏయిర్ పోర్టు నుంచి 7కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వచ్చే 6 నుంచి 8ఏండ్లలో ప్రయాణికుల సంఖ్య 13కోట్లు చేరుకుంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చే వారిలో 25శాతం మంది ప్రయాణికులు టెర్మినల్1, టెర్మినల్ 2, టెర్మినల్ 3 మధ్య ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. ఎయిర్ పోర్టులో విమానం దిగిన ప్రయాణికులు బయటకు వచ్చేందు బస్సు సర్వీసులపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రయాణికులు ఒక టెర్మినల్ నుంచి మరో టెర్మినల్ వైపునకు వెళ్లేందుకు చాలా ఆలస్యం అవుతుంది.
ఈనేపథ్యంలో ఢిల్లీ ఎయిర్ పోర్టులోని 3 టెర్మినల్స్ మధ్య మొత్తం 7.7కిలోమీటర్ల పొడవున ఈ ఎయిర్ ట్రైన్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఎయిర్ పోర్టులోని 3 టెర్మినళ్ల మధ్య ప్రయాణికుల ప్రయాణం మరింత సులభం చేసేందుకు రూ. 2వేల కోట్లతో ఈ ఎయిర్ ట్రైన్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. 2027నాటికి ఈ ఎయిర్ ట్రైన్ వినియోగంలోకి తీసుకువచ్చే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
అయితే ఈ ఎయిర్ ట్రైన్ ను ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ అని పిలుస్తారు. ఈ తొలి ఎయిర్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి బిడ్లను ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో స్వీకరించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు దక్కించుకున్న వారికి ఈ ఆర్థిక ఏడాది చివరిలోగా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి పనులను అప్పగించనున్నారు.
Also Read : Madhavi latha: వందే భారత్ ట్రైన్‌లో మాదవీలత హల్ చల్.. లడ్డు వివాదంపై ఏంచేశారో తెలుసా.?.. వీడియో వైరల్..
ఈ రైలుకు నాలుగు స్టాప్‌లు ఉంటాయి:
DIAL ముందుగా ఈ ఎయిర్ రైలుకు ఆరు స్టాప్‌లు వేయాలని ప్లాన్ చేసింది. కానీ దానిని ప్రభుత్వం తిరస్కరించింది. చాలా స్టాప్‌లు ఉండటం వల్ల T1, T2/3 మధ్య ప్రయాణ సమయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. DIAL మల్టీ-స్టాప్ మోడల్, ఏరోసిటీలో రెండు స్టాప్‌లను కలిగి ఉంటుంది. T1, T2/3 మధ్య ప్రయాణ సమయాన్ని పెంచడమే కాకుండా నాన్-టెర్మినల్ స్టాప్‌లలో ఫూల్‌ప్రూఫ్ భద్రత కూడా అవసరం.
Also Read : IPL 2025 Retention Rules: ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ ఇవే..? RTM, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు బై బై..!
ఎయిర్ రైలు అంటే ఏమిటి?
ఎయిర్ ట్రైన్, ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ (APM) అని కూడా పిలుస్తారు. ఇది విమానాశ్రయాలలో వివిధ టెర్మినల్స్, ఇతర ముఖ్యమైన ప్రదేశాలను కనెక్ట్ చేయడానికి ఉపయోగించే ఆటోమేటెడ్ రైలు వ్యవస్థ. దీని ప్రధాన లక్ష్యం ప్రయాణికులను ఒక టెర్మినల్ నుండి మరొక టెర్మినల్‌కు వేగంగా, అనుకూలమైన రీతిలో రవాణా చేయడం. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రైలు సౌకర్యంతో, ప్రయాణీకులు షటిల్ బస్సుల అవసరం తగ్గుతుంది.ప్రయాణికులు ఒక టెర్మినల్ నుండి మరొక టెర్మినల్‌కు వేగంగా చేరుకోగలుగుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook