IPL 2025 Retention Rules: ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ ఇవే..? RTM, ఇంపాక్ట్ ప్లేయర్‌ రూల్‌కు బై బై..!

IPL 2025 Player Retention Rules: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి కొత్త రిటెన్షన్ నిబంధనలపై ఉత్కంఠ నెలకొంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఈసారి రిటెన్షన్ రూల్స్ మారుస్తుందని ప్రచారం జరుగుతోంది. రైట్ టు మ్యాచ్ (RTM) కార్డులను తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. అత్యధికంగా ఐదుగురు ప్లేయర్లను రిటెన్షన్ చేసుకునే అవకాశం ఉంటుందని అందరూ అంటున్నారు. అతి త్వరలోనే రిటెన్షన్ రూల్స్‌ను వెల్లడించనుంది. 
 

1 /7

అన్ని ఫ్రాంఛైజీలు ఐదుగురు ఆటగాళ్లను తమ వద్దే అట్టిపెట్టుకోవాలని భావిస్తున్నాయి. గతంలో నలుగురు ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఉండేది.  

2 /7

గతంలో కీలక ఆటగాళ్లను వేలంలో తిరిగి దక్కించుకునేందుకు ఆర్‌టీఎమ్‌ కార్డును ఉపయోగించేవారు. అయితే ఈసారి ఆర్‌టీఎమ్ కార్డు ఆప్షన్ ఉండదని అంటున్నారు.  

3 /7

ముగ్గురు భారతీయ ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ ప్లేయర్లను ఫ్రాంచైజీలు నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.  

4 /7

ఇక ఎంతో వివాదాస్పదంగా మారిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను కూడా రద్దు చేస్తారని అంటున్నారు. ఈ నిబంధనపై క్రికెటర్లు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే.  

5 /7

కొత్త రూల్స్‌తో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి ఫ్రాంచైజీలు తమ స్టార్ ప్లేయర్‌లను తమతోనే ఉంచుకోవాలని భావిస్తున్నాయి. తక్కవ స్టార్లు ఉన్న జట్లు కఠిన నిబంధనలు ఉండాలని కోరుతున్నాయి.  

6 /7

నవంబరు చివరిలో లేదా డిసెంబర్ నెల ప్రారంభంలో భారీ వేలం ఉంటుందని భావిస్తున్నారు. ఈలోపు బీసీసీఐ నిబంధనలు వెల్లడిస్తుంది.  

7 /7

రిటెన్షన్ నిబంధనలు వస్తే.. ఎవరిని టీమ్ నుంచి రిలీజ్ చేయాలి..? ఎవరిని ఉంచుకోవాలనే విషయంపై ఫ్రాంచైజీలు ఓ స్పష్టతకు రానున్నాయి.