Infinix Gt 10 Pro Price: ప్రస్తుతం యువత గేమింగ్ స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు మంచి కెమెరా క్వాలిటీ తో మిడిల్ రేంజ్ బడ్జెట్ కలిగిన స్మార్ట్ ఫోన్స్ కే మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని గత నెలలోనే ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ గేమ్స్ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు మార్కెట్లో మంచి గుర్తింపు లభించింది. దీంతోపాటు ఈ మొబైల్ ఫోన్ల విక్రయాలు కూడా భారీగా పెరిగాయి. అంతేకాకుండా విడుదల చేసిన కొన్ని రోజుల్లోనే ఎక్కువ యూనిట్లు అమ్ముడుపోవడంతో అధికారిక వెబ్సైట్ తో పాటు ఈ కామర్స్ కంపెనీ ప్లాట్ ఫార్మ్స్ లో అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేసాయి. ఇంతకీ ఈ ఫోన్ ఏంటో, ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలు, ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్ఫినిక్స్ కంపెనీ ఈ గేమింగ్-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ Infinix GT 10 Pro పేరుతో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మొబైల్ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన AMOLED డిస్‌ప్లే, శక్తివంతమైన డైమెన్సిటీ 8-సిరీస్ ప్రాసెసర్, 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ లాంటి అనేక రకాల ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. అయితే మొదట ఈ స్మార్ట్ ఫోన్ ను ఇన్ఫినిక్స్ కంపెనీ రూ. 24,999లకు విడుదల చేయగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్ ఫోన్ పై దాదాపు 16 శాతంకు పైగా తగ్గింపు అందించింది. దీంతో ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ రూ. 20,999లకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్‌ అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లను వినియోగించి Infinix GT 10 Proని కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు లభిస్తుంది.


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


ఫ్లిప్‌కార్ట్‌లో Infinix GT 10 Proని బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేస్తే అదనపు తగ్గింపు కూడా లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు మీ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లిస్తే రూ. 1,500 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును కూడా వినియోగించి ఈ స్మార్ట్ ఫోన్ పై అదనపు తగ్గింపు పొందవచ్చు. ఈ కార్డును వినియోగించి ఈ Infinix GT 10 Proని చేస్తే దాదాపు ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది దీనికోసం.. మీరు మీ పాత ఫోను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ లో మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసి Infinix GT 10 Proని కొనుగోలు చేస్తే రూ.6,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో లేదు..అయితే ఈ మొబైల్ ను చేయాలనుకునేవారు సెప్టెంబర్ 9 మధ్యాహ్నం 12 గంటల నుంచి పొందవచ్చు.


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి