Infinix Hot 30 Price in India: ప్రముఖ టెక్ కంపెనీ Infinix మార్కెట్లోకి మరో బడ్జెట్ కొన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. Infinix Hot 30 5G పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన వేరియంట్లకు సంబంధించిన వివరాలను రంగులను అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. కానీ ఇప్పటికీ కంపెనీ లాంచింగ్ తేది వివరాలను మాత్రం అధికారికంగా వివరించలేదు. రాబోయే Infinix హ్యాండ్‌సెట్ మూడు రంగుల్లో లభించబోతోంది. ఈ ఫోన్‌లో హోల్-పంచ్ డిజైన్, USB టైప్-సి పోర్ట్, మైక్రోఫోన్ వంటి చాలా రకాల ఫీచర్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GSMArena నివేదికల ప్రకారం..త్వరలో మార్కెట్లోకి విడుదల కాబోయే Infinix Hot 30 ఎల్‌ఈడీ(LED) ఫ్లాష్‌తో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ ను కలిగి ఉంటుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ తో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ తో కంపెనీ మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్ ని మాత్రం అధికారికంగా వివరించలేదు. లీకైన ఫోటోల ప్రకారం..స్మార్ట్‌ఫోన్‌కు ఎడమ వైపున సిమ్ కార్డ్ స్లాట్ తోపాటు పవర్ బటన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండే అవకాశం ఉందని ఫోటోలను చూస్తే తెలుస్తోంది. 


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా


అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్లో USB-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, మైక్రోఫోన్, స్పీకర్ గ్రిల్స్ దిగువ భాగంలో ఉంటాయి. మార్కెట్లోకి ఈ మొబైల్ ఫోన్ విడుదలయితే ఆరెంజ్, అరోరా బ్లూ, నైట్ బ్లాక్‌ మూడు రంగుల్లో లభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందులో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP53 రేటింగ్, 6000mAh బ్యాటరీ ఉన్నాయి. 


కంపెనీ ఇప్పటికే Infinix హాట్ 30 4Gని థాయ్‌లాండ్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో కస్టమర్లకు అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది MediaTek Helio G88 ప్రాసెసర్‌తో పాటు సెల్ఫీ కెమెరాతో హోల్-పంచ్ డిస్‌ప్లేను కలిగి ఉందని థాయ్‌ సంబంధించిన ఓ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook